హోరాహోరీగా బాస్కెట్‌బాల్‌ టోర్నీ

29 Dec, 2016 22:22 IST|Sakshi
రామచంద్రపురం :
స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేష¯ŒS అండర్‌–19 బాలుర, బాలికల 62వ బాస్కెట్‌బాల్‌ పోటీలు స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో హోరాహోరీగా జరుగుతున్నాయి. రెండో రోజైన గురువారం నాటికి పోటీలు క్వార్టర్స్‌ దశకు చేరుకున్నాయి. పూల్‌–ఏలో కృష్ణా, కడప, పూల్‌–బీలో గుంటూరు, పశ్చిమ గోదావరి, పూల్‌–సీలో చిత్తూరు, అనంతపురం, పూల్‌–డీలో తూర్పుగోదావరి, కర్నూల్‌ జట్లు క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. కర్నూల్‌పై గుంటూరు, చిత్తూరుపై కడప, అనంతపురంపై కృష్ణా, తూర్పుగోదావరిపై పశ్చిమ గోదావరి జట్లు తలపడనున్నాయి. బాలికల విభాగంలో వైజాగ్‌పై చిత్తూరు 33–15, నెల్లూరుపై అనంతపురం 36–02, కృష్ణాపై  తూర్పుగోదావరి 22–11, పశ్చిమగోదావరిపై కర్నూల్‌ 20–10, నెల్లూరుపై కర్నూల్‌ 17–8 పాయింట్లతో గెలుపొందాయి. తూర్పుగోదావరి–చిత్తూరు, విశాఖ–కృష్ణా, అనంతపురం–పశ్చిమ గోదావరి జట్లు తలపడనున్నాయి. ఎస్‌జీఎస్‌ ప్రతినిధి పి.సీతాపతి, ఎస్‌జీఎస్‌ అండర్‌–19 జిల్లా కార్యదర్శి వై.తాతబ్బాయి పోటీలను పర్యవేక్షించారు. పీడీలు జంపన రఘురాం, గెడా శ్రీనివాస్‌ బాస్కెట్‌బాల్‌ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు