బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

17 Oct, 2016 21:35 IST|Sakshi
బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం
 
గుంటూరు స్పోర్ట్స్‌ : డీఎస్‌ఆర్‌ ఫ్రండ్స్‌ క్లబ్‌ ఆ«ధ్వర్యంలో 3వ దొండపాటి శ్రీనివాసరావు మెమోరియల్‌  మహిళల, పురుషుల బాస్కెట్‌ బాల్‌ జిల్లా స్దాయి టోర్నమెంట్‌ సోమవారం బ్రహ్మనందరెడ్డి స్టేడియంలో ప్రారంభమైంది. టోర్నమెంట్‌లో 16 పురుషుల, 6మహిళల జట్లు పాల్గొన్నాయి. ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌ కుమార్‌ క్రీడాకారులను పరిచయం చేసుకోని బాస్కెట్‌ బాల్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఆకుల బాలకష్ణ క్రీడాకారులకు బూట్లను పంపిణీ చేశారు. వీఆర్‌ హైస్కూల్‌ డైరెక్టర్‌ వి.వెంకటేశ్వరరావు, ఆర్‌.భాస్కర్‌ రావు, పి.రవిశంకర్, టీ.గురునాధం, ఎం.రమేష్‌ బాబు, బాస్కెట్‌ బాల్‌ శిక్షకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు