రాష్ట్రస్థాయిలో విజేతగా నిలవాలి

9 Sep, 2016 23:06 IST|Sakshi
జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జాకీర్‌ 
మహబూబ్‌నగర్‌ క్రీడలు: రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ టోర్నీలో జిల్లా జట్లు విజేతగా నిలవాలని జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జాకీర్‌ అడ్వకేట్‌ అన్నారు. హైదరాబాద్‌ జింఖానా మైదానంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు వరకు జరగనున్నS సబ్‌జూనియర్‌ రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనే జిల్లా బాలబాలికల జట్లు తరలివెళ్లాయి. ఈ సందర్భంగా ఆయన జిల్లా జట్లను అభినందించారు. ఏకాగ్రత, సమష్టిగా ఆడి విజేతగా నిలవాలని కోరారు. జిల్లాలో బాస్కెట్‌బాల్‌ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యం ప్రదర్శించే క్రీడాకారులకు తమవంతు సహకారం ఉంటుందని వెల్లడించారు. ఈనెల 5న స్థానిక స్టేడియంలో సెలక్షన్‌ నిర్వహించి జిల్లా బాలబాలికల జట్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మీర్‌ అర్షద్‌ అలీ, డీఎస్‌ఏ కోచ్‌ ఖలీల్‌ పాల్గొన్నారు.
బాలుర జట్టు: అఫ్రోజ్‌ అలీ, ఆది శేషవ్, ప్రశాంత్, సయ్యద్‌ ఆసిఫ్, ఎండీ ఆమేర్, ఉదయ్‌కుమార్, శివప్రసాద్, సాయిదీపక్, రోహిత్‌కుమార్, నవీన్‌కుమార్, రాంగోపాల్, శ్రీనివాస్‌. కోచ్, మేనేజర్లు ఎండీ ఖలీల్, మహేష్‌కుమార్‌. 
బాలికల జట్టు: ఆర్షిత, ప్రియాంక, స్వర్ణలత, తేజస్విని, రిషితారెడ్డి, సుష్మ, శ్రీలత, వందన, సంధ్యారాణి, భవాని, తనుజ, భువనేశ్వరి, హరిణి రెడ్డి, కోచ్, మేనేజర్లు శైలజ, అరవింద్‌. 

 

మరిన్ని వార్తలు