తుపాన్‌ సమయంలో అప్రమత్తం

12 Dec, 2016 23:07 IST|Sakshi
తుపాన్‌ సమయంలో అప్రమత్తం
కర్నూలు(రాజ్‌విహార్‌): వర్దా తుఫాను విపత్తు పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్‌ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ సెక్రటరీ అజయ్‌జైన్‌ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన విజయవాడలోని ప్రధాన కార్యాలయం నుంచి స్థానిక అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నై, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు తదితర ప్రాంతాల్లో వర్దా తుఫాను బీభత్సం సృష్టిస్తోందన్నారు. తుఫాను కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండి వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు, వినియోగదారుల సేవల్లో లోపం లేకుండా చూడాలని, సమస్యలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఈ భార్గవ రాముడు, డీఈ పీవీ రమేష్, ఏడీఈలు ప్రసాద్, రంగస్వామి, విజయసారధి, నవీన్‌బాబు పాల్గొన్నారు.  
 
మరిన్ని వార్తలు