డెంగీపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

17 Jun, 2017 23:24 IST|Sakshi
డెంగీపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

అనంతపురం అర్బన్‌ :

‘వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డెంగీ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి. పారిశుద్ధ్యం మెరుగుపర్చాలి. డెంగీ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించండి’ అని కలెక్టర్‌ వీరపాండియన్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ నుంచి డెంగీ వ్యాధి, గృహ నిర్మాణం, నీరు - ప్రగతి పనులపై వేర్వేరుగా ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ప్రతి నాల్గో శనివారం దోమలపై దండయాత్ర కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించేలా ప్రజలను చైతన్యపర్చాలన్నారు. ఆర్‌ఎంపీలు జ్వరంతో వచ్చిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్‌ చేయాలని, అలా కాకుండా వైద్యం అందిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్‌టీఆర్‌ గ్రామీణ, పట్టణ గృహ పథకం కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల తీరు సక్రమంగా లేదన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 11,487 ఇళ్లు గ్రౌండింగ్‌ చేశారని, 2,285 మాత్రమే పూర్తి చేశారని, పట్టణాల్లో 2,590 గ్రౌండింగ్‌ చేశారని, 153 మాత్రమే పూర్తి చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామసభలు నిర్వహించి 2017 - 18, 2018 - 19 సంవత్సరాలకు లబ్ధిదారులను వారం రోజుల్లోగా ఎంపిక చేయాలని ఆదేశించారు. నీరు - ప్రగతి కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. టెండర్ల ద్వారా చేపట్టాల్సిన పనులకు సంబంధించి వారంలో టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. సమావేశంలో జేసీ - 2 సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, హౌసింగ్‌ పీడీ ప్రసాద్, ఇరిగేషన్‌ ఎస్‌ఈ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గోవా నుంచి రిటర్న్‌ అయిన ‘డిస్కో రాజా’

ఆ సినిమా పక్కన పెట్టిన బన్నీ!

అభిమానులకు సూర్య విన్నపం

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన అనసూయ

కంగనా డిమాండ్‌ రూ.20 కోట్లు?

‘వీలు దొరక్కపోతే వీడియోకాల్‌ అయినా చేస్తా..’