పకడ్బందీగా పంటకోత ప్రయోగాలు

17 Sep, 2016 22:43 IST|Sakshi
పకడ్బందీగా పంటకోత ప్రయోగాలు
–సీపీఓ ఆనంద్‌నాయక్‌
కర్నూలు(అగ్రికల్చర్‌): పంటకోత ప్రయోగాలను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఆనంద్‌నాయక్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని సనయన ఆడిటోరియంలో వ్యవసాయశాఖ ఏడీలు, అసిస్టెంటు స్టాటిస్టికల్‌ ఆఫీసర్లు తదితరులకు పంటకోత ప్రయోగాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఓ మాట్లాడుతూ...పంటకోత ప్రయోగాలను వ్యవసాయశాఖ, జిల్లా ప్రణాళిక విభాగం చెరి సగం చేపడుతాయని వివరించారు. జిల్లాలో గ్రామం యూనిట్‌గా వరికి బీమా అమలు చేస్తున్నామని, ప్రతి 100 హెక్టార్లను ఒక యూనిట్‌గా తీసుకొని పంట కోత ప్రయోగాలు నిర్వహించాలన్నారు. వరిలో 5‘5 మీటర్లు, కందిలో 10‘10 మీటర్ల ప్లాట్‌లో పంటకోత ప్రయోగం నిర్వహించాలని వివరించారు. జేడీఏ ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ..ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ప్రీమియంతో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యెజనను అమలు చేస్తోందన్నారు. నష్టపోయిన రైతులకు ఈ పథకం కింద పరిహారం రావాలంటే పంటకోత ప్రయోగాలు అత్యంతకీలకమన్నారు. సమావేశంలో ఎల్‌డీసీఎం నరసింహారావు, ఉద్యానశాఖ సహాయ సంచాలకులు రఘునాథరెడ్డి, జిల్లా ప్రణాళిక విభాగం డీడీ కష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు