సమరశీల పోరాటాలకు సిద్ధమవుదాం

26 Dec, 2016 00:49 IST|Sakshi
ఎమ్మిగనూరురూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సవాలుగా మారిన సీపీఎస్‌ రద్దు కోసం çసమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని డీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యాదర్శి ఎస్వీ రమణయ్య పిలుపునిచ్చారు. స్థానిక గా«ంధీనగర్‌లో డీటీఎఫ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు పదవి విరమణ పొందిన తరువాత భవిష్యత్త్‌కు భద్రత లేని కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని అమలు చేయడం తగదన్నారు. ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు అనుకులంగా సంక్షేమ రంగంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని అలోచిస్తున్నాయన్నారు. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రీయ మాధ్యమిక  శిక్షా అభియాన్‌ కింద 9565 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు మంజూరు కాగా నిబంధనలకు విరుద్ధంగా వాటిలో 155 మందికి హెచ్‌ఎంలుగా పదోన్నతలు కల్పించారన్నారు. దీంతో సాంకేతికంగా జీతాలు చెల్లింపు సమస్య వచ్చిందని చెప్పారు. జిల్లాలో పదోన్నతులు పొందిన 33 మంది హెచ్‌ఎంల జీతాల చెల్లింపునకు ట్రెజరీ అధికారులు నిరాకరిస్తే డీటీఎఫ్‌ కృషి ఫలితంగా ఏపీ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను అమలు చేస్తూ ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందన్నారు. అయితే సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.  ఇందులో భాగంగా 2012 జనవరిలో జారీ చేసిన 3,4 జీఓలను సవరించి హెచ్‌ఎంల పోస్టులు మంజూరు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారంకోసం  2017 జనవరి 11 న విజయవాడ(అమరావతి)లో ధర్నా తలపెట్టినట్లు చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి కె.రత్నం, జిల్లా అ«ధ్యక్ష, కార్యదర్శులు కరె కృష్ణ, జి.తిమ్మప్ప నాయాకులు వీరన్న, గొట్ల చంద్రశేకర్, కిశోర్, రామన్న, వెంకట్రాముడు, ఈశ్వరరెడ్డి, వీరేష్‌ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు