బీచ్‌లవ్ ఆగదు

8 Nov, 2016 02:01 IST|Sakshi
బీచ్‌లవ్ ఆగదు

- అది ఓ వినూత్న కార్యక్రమం
- సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
 
 సాక్షి, అమరావతి బ్యూరో: ‘విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ ద్వారా వినూత్న కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. బీచ్‌ను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగానే దీన్ని నిర్వహిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతిని అపహాస్యం చేసేలా విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. దీనిపై తొలిసారి స్పందించిన సీఎం మాత్రం తమ ప్రభుత్వ చర్యను గట్టిగా సమర్థించుకున్నారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ కాలేజీలో 2వ ఆంధ్రప్రదేశ్ సైన్‌‌స కాంగ్రెస్-2016 సదస్సును చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ నిర్వహణను కొందరు అపహాస్యం చేసేలా ప్రకటనలు ఇస్తూ రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను మొదటి నుంచి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే వ్యక్తినని చెబుతూ.. విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహించి తీరుతామని ఉద్ఘాటించారు.

 పురస్కారాల ప్రదానం  
 ఈ సదస్సులో పలువురు ప్రముఖులకు, యువ సైంటిస్ట్‌లకు అవార్డులను సీఎం చేతుల మీదుగా అందజేశారు. సైన్‌‌స రంగంలో ప్రముఖులైన ఏవీఆర్‌ఏ చైర్మన్ డాక్టర్ ఏవీ రామారావు, మణిపాల్ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ బీఎం హెడ్జీ, నిమ్స్ మాజీ డెరైక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు, బీఎం బిర్లా సైన్‌‌స సెంటర్ డెరైక్టర్ డాక్టర్ బీజీ సిద్ధార్థలకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు. అలాగే రక్షణ శాఖ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి, లారస్ ల్యాబ్స్ అధినేత డాక్టర్  సి.హెచ్.సత్యనారాయణ, అడ్వాన్‌‌స సిస్టమ్స్ లేబొలేటరీ డెరైక్టర్ డాక్టర్ తెస్సీ తోమస్‌లకు డిస్టింగ్విషెడ్ సైంటిస్ట్ అవార్డులు ప్రదానం చేశారు.

 10న ఢిల్లీకి సీఎం చంద్రబాబు  
 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 10న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ రకాల పెండింగ్ సమస్యలపై ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ నేపథ్యంలో ఏఏ శాఖలో ఎలాంటి పరిష్కారం కాని సమస్యల వివరాలను వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.
 
 తిరుపతిలో సైన్స మ్యూజియం
 ప్రపంచ స్థారుులో ఉన్నతమైన అంశాలతో కూడిన సైన్‌‌స మ్యూజియం తిరుపతిలో ఏర్పాటుకు కృషి చేస్తానని, అందుకు అవసరమైన 50 ఎకరాల  భూములను ఇచ్చేం దుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చం ద్రబాబు తెలిపారు. జనవరిలో తిరుపతిలో జరగబోయే జాతీయస్థారుు సైన్‌‌స సెమినార్ ప్రారంభానికి ప్రధాని మోదీ రానున్నారని, ఆయన చేతుల మీదగా సైన్‌‌స మ్యూజియానికి శంకుస్థాపన చేరుుస్తామన్నారు.

మరిన్ని వార్తలు