జిల్లాలో కేరళకు దీటైన అందాలు

15 Dec, 2016 22:34 IST|Sakshi
కోటగమ్మం (రాజమహేంద్రవరం) :
పర్యాటకంగా అభివృద్ధి చెందిన కేరళ వంటి రాష్ట్రాలకు దీటుగా జిల్లాలో రమణీయమైన పర్యాటక ప్రాంతాలు, వనరులు ఉన్నాయని కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక, ఆహారశుద్ధి పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, రారాష్ట్రాన్ని పర్యాటకరంగంలో అగ్రగామిగా నిలిపేందుకు స్వయంగా ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. పర్యాటక, ఆహారశుద్ధి పరిశ్రమల్లో పెట్టుబడులపై ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో గురువారం హోటల్‌ రివర్‌బేలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సద్వినియోగం చేసుకుని, తగిన ప్రాజెక్టులతో ముందుకు రావాలని సూచించారు. కాకినాడ బీచ్‌ పార్కు అభివృద్ధికి ప్రభుత్వం రూ.85 కోట్లు మంజూరు చేసిందని, మొదటి దశ పనులను ఈనెలలో ప్రారంభిస్తామని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్టు కింద  రూ. 56 కోట్లతో రాజమహేంద్రవరంలోని స్నానఘట్టాలన్నింటినీ అనుసంధానం చేసి, గోదావరితీరంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఈట్‌స్ట్రీట్,  జల క్రీడలు నిర్వహిస్తామన్నారు.  కడియం నర్సరీలను అనుసంధానిస్తూ బోటు రైడింగ్‌ వంటి కార్యక్రమాల ద్వారా పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి కేంద్రానికి నివేదించినట్లు తెలిపారు. పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గిరిజాశంకర్‌ మాట్లాడుతూ పర్యాటక ప్రాజెక్టు చేపట్టిన ఔత్సాహికులకు మూడేళ్ల పాటు లీజు, అద్దెలపై మారటోరియంను అమలు చేస్తామన్నారు. మారేడుమిల్లిలో ఎకో టూరిజం ప్రాజెక్టును చేపట్టామని, కాకినాడ బీచ్, హోప్‌ ఐలాండ్, కోరింగ మడ అడవులను, అఖండ గోదావరి తీరాన్ని, కోనసీమ ప్రాంతాలను  అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కాకినాడ తీరాన్ని, హోప్‌ఐలాండ్, కోరింగ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రూ.70 కోట్లు, అఖండ గోదావరి తీరాన్ని ఎకో, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. కోనసీమలో హెరిటేజ్, గ్రామీణ, వ్యవసాయ రంగాలన కలుపుతూ ప్రత్యేక పర్యాటక ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఏపీ ఫిక్కీ చైర్మ¯ŒS వి.వాసుదేవరావు, టూరిజం సబ్‌ కమిటీ చైర్మ¯ŒS కె.లక్ష్మినారాయణ, అఖండ గోదావరి ప్రాజెక్టు ఈడీ జి.భీమశంకరం తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు