కళ్యాణదుర్గం కేవీకేకు రాష్ట్ర ఉత్తమ అవార్డు

12 Dec, 2016 14:47 IST|Sakshi

కళ్యాణదుర్గం రూరల్ : కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో ఉన్న లక్ష్మిదేవమ్మ కృషి విజ్ఞాన కేంద్రానికి రాష్ట్ర ఉత్తమ అవార్డు వచ్చింది. ఈనెల 5న నంద్యాలలో జరిగిన పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశంలో రాష్ట్ర ఉత్తమ కేవీకేగా అవార్డును కో ఆర్డినేటర్‌ జాన్‌సుధీర్‌కు వ్యవసాయశాఖ కమిషనర్‌ ధనుంజయరెడ్డి, ఎన్జీరంగా విశ్వవిద్యాలయ సంచాలకుల చేతులమీదుగా అవార్డును ప్రదానం చేశారు.

రైతులకు అందుబాటులో ఉంటూ కరువు జిల్లా అయినా అనంతలో 70 శాతం మంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారని, ఇందులో రైతులకు చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయల పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తూ మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలిపి మంచి ఫలితాలు సాధించారు. దీంతో వ్యవసాయ శాఖ గుర్తించి రాష్ట్ర ఉత్తమ కేవీకేగా అవార్డును అందజేసింది. ఈ అవార్డు జాన్‌సుధీర్‌ అందుకున్నారు.  

మరిన్ని వార్తలు