సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలు

6 Aug, 2016 00:28 IST|Sakshi
సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలు
 
  • స్కైప్‌ ద్వారా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌
  •  ఎస్పీ విశాల్‌గున్నీ
నెల్లూరు(క్రైమ్‌) :
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తూ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తామని ఎస్పీ విశాల్‌గున్నీ వెల్లడించారు. వనం–మనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో ఏఎస్పీలు బి. శరత్‌బాబు, కె. సూరిబాబు ఆధ్వర్యంలో డీఎస్పీలు మొక్కలు నాటారు. ఎస్పీ కృష్ణా పుష్కరాల విధుల్లో ఉండటంతో మాస్‌ప్లాంటేషన్‌ కార్యక్రమాన్ని స్కైప్‌ వీడియో కాలింగ్‌ ద్వారా సమీక్షించారు. ఆయన స్కైప్‌లో విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్‌లో భూగ్రహం మీద జీవులు మనుగడ సాధించాలంటే ఇప్పటినుంచే మొక్కలు విరివిగా నాటాల్సిన అవసరం ఉందన్నారు.  జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్, పోలీస్‌గ్రౌండ్స్, క్వార్టర్స్, దత్తత గ్రామాలు, విద్యాలయాల్లో రెండు రోజుల్లోపు 5 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏఎస్పీ బి. శరత్‌బాబు మాట్లాడుతూ మానవుడు ప్రకృతి వనరులు అవసరానికి మించి వాడడం ద్వారా వివిధ రకాల కాలుష్యాలను సృష్టించి పుడమి తల్లికి అపార నష్టం కల్గిస్తున్నాడన్నారు. డీఎస్పీలు కోటారెడ్డి, జీవీ రాముడు, తిరుమలేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్, సుధాకర్, బాలసుందరం, మోహన్‌రావు, శ్రీనివాసరావు, చెంచురెడ్డి, ఆర్‌ఐలు కేజేఎం చిరంజీవి, శ్రీనివాసరావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ మాణిక్యరావు, ఎస్‌ఐ బి. శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు