బాబోయ్‌! భాగ్యనగర్‌

12 Dec, 2016 15:10 IST|Sakshi
  • గ్యాస్‌ పైపులైను నుంచి లీకైన గ్యాస్‌ 
  • భయాందోళనతో పరుగులు తీసిన ప్రజలు
  • కాకినాడ రూరల్‌ :
    సూర్యారావుపేట లైట్‌హౌస్‌ ప్రాంతంలోని ఎ¯ŒSసీఎస్‌ ఆయిల్‌ ఫ్యాక్టరీ సమీపాన భాగ్యనగర్‌ గ్యాస్‌ పైపులైన్‌ నుంచి లీకవడంతో అక్కడి ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. సుమారు రెండు గంటలపాటు అటుగా వెళ్లేందుకు ప్రజలు, కార్మికులు హడలెత్తారు. లీకేజీ సమాచారం అందుకున్న భాగ్యనగర్‌ గ్యాస్‌ సంస్థ సిబ్బంది, ఎన్‌ఎఫ్‌సీఎల్, కోరమండల్‌ ఫెర్టిలైజర్స్‌కు చెందిన అగ్నిమాపక శకటాలు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలి వచ్చాయి. అప్పటికే ఉధృతంగా ఎగజిమ్ముతున్న గ్యాస్‌ను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అరగంట అనంతరం లీకేజీని అరికట్టారు.
    ప్రమాదకరం కాదు
    ప్రొక్లెయిన్‌తో మొక్కలను తొలగిస్తూ్తండగా దాని బకెట్‌ పైపులైనకు తగిలి రంధ్రం పడి ఉంటుందని ‘భాగ్యనగర్‌’ డిప్యూటీ మేనేజర్‌ డీవీ అనిల్‌కుమార్‌ చెప్పారు. ఈ గ్యాస్‌ అంత ప్రమాదకరం కాదని, ప్రతి 50 మీటర్లకు హెచ్చరిక బోర్డు ఉంటుందని, పైపులైనును నిత్యం నలుగురు పెట్రోలింగ్‌ చేస్తూంటారని వివరించారు. ఎక్కడైనా గ్యాస్‌ లీకవుతున్నట్లు తెలిస్తే తక్షణం సరఫరాను ఆపేందుకు వీలుగా ప్రతి కిలోమీటరుకు కంట్రోల్‌ వాల్వ్‌ ఉంటుందన్నారు. కాగా, ఆ ప్రాంతంలో ఎటువంటి పొక్లెయిన్‌ కనిపించలేదని, నాసిరకమైన పైపులు వాడడంతో తరచూ ఏదో ఒకచోట గ్యాస్‌ లీకవుతూనే ఉందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. 
    గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలి : కురసాల కన్నబాబు
    పగటివేళ జరిగింది కాబట్టి ఎటువంటి ప్రమాదమూ జరగలేదని, అదే అర్ధరాత్రి లీకైతే పరిస్థితేమిటని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు భాగ్యనగర్‌ గ్యాస్‌ సంస్థ అధికారులను నిలదీశారు. తాగునీటి పైపులనే దాదాపు పదడుగుల లోతులో వేస్తారని, అత్యంత ప్రమాదకరమైన గ్యాస్‌ పైపులైనును అడుగు లోతు కూడా లేకుండా వేసుకుపోయారంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అరమవుతోందని విమర్శించారు. గ్యాస్‌ పైపులైనుకు రెండడుగుల దూరంలో ఆయిల్‌ కంపెనీకి క్రూడాయిల్‌ సరఫరా చేసే పైపులైన్లు ఉన్నాయని, 50 మీటర్ల దూరంలో పెద్ద ఆయిల్‌ ఫ్యాక్టరీలు, నాఫ్తలి¯ŒS ఆయిల్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయని గుర్తు చేశారు. గ్యాస్‌ లీకేజీని ఎవ్వరూ గమనించకుండా ఉంటే వాటి పరిస్థితి, సమీపంలో ఉన్న మత్స్యకారులు పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు. పైపులైన్లు విషయంలో భాగ్యనగర్‌ సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రస్తుతం వేసిన పైపులు నాసిరకంగా ఉండడం, భూమికి పైపైనే పైపులైను ఉండడంతో ఇటువంటి ప్రమాదకర పరిస్థితులను ప్రజలు నిత్యం ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. దీనిపై భాగ్యనగర్‌ గ్యాస్‌ సంస్థ యాజమాన్యంతో మాట్లాడనున్నట్లు కన్నబాబు వివరించారు. ఆయన వెంట మాజీ సర్పంచ్‌ కోమలి సత్యనారాయణ, బొమ్మిడి శ్రీనివాస్, పార్టీ నాయకులు శెట్టి బాబూరావు, గొల్లపల్లి ప్రసాద్, కర్రి చక్రధర్, జంగా గగారి¯ŒS తదితరులు ఉన్నారు.
     
>
మరిన్ని వార్తలు