భక్తులతో కిటకిటలాడిన మద్దిక్షేత్రం

7 Jun, 2017 00:20 IST|Sakshi
భక్తులతో కిటకిటలాడిన మద్దిక్షేత్రం
జంగారెడ్డిగూడెం రూరల్‌ :  జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు స్వామ వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. 1,110 మంది భక్తులు స్వామి వారి అన్నప్రసాదాన్ని స్వీకరించారని, 2,58,123 రూపాయల ఆదాయం లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఆలయ చైర్మన్‌ యిందుకూరి రంగరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు.  
 
మరిన్ని వార్తలు