నాణ్యతా ప్రమాణాలతో భారతీ సిమెంట్‌

19 Oct, 2016 21:34 IST|Sakshi
నాణ్యతా ప్రమాణాలతో భారతీ సిమెంట్‌
– తాపీ మేస్త్రీల సంక్షేమానికి రూ.లక్ష బీమా 
 
ఆదోని టౌన్‌: నాణ్యతా ప్రమాణాలకు పెట్టింది పేరు భారతీ సిమెంట్‌ అని ఆ సంస్థ జిల్లా సేల్స్‌ మేనేజర్‌ విజయ్‌భాస్కర్‌ తెలిపారు. బుధవారం రాత్రి ఆదోని పట్టణంలోని మోర్‌ ఫంక‌్షన్‌ హాల్‌లో భారతి సిమెంట్‌ తాపీ మేస్త్రీల సమావేశాన్ని స్థానిక డీలర్‌ నర్సింహారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ ఉత్పత్తి ప్రారంభించిన ఆరేళ్లలోనే భారతి సిమెంట్‌ వినియోగదారుల మన్ననలను పొందిందన్నారు. జర్మనీ టెక్నాలజీ, రోబోటెక్‌ క్వాలిటీ కంట్రోల్, ట్యాంపర్‌ ఫ్రూఫ్‌ ప్యాకింగ్‌తో దేశంలోనే అగ్రగ్రామిగా నిలిచిందన్నారు. ప్రతి బస్తా రోబోటెక్‌ క్వాలిటీ కంట్రోల్‌ ద్వారా పరీక్షించబడుతుందన్నారు. భారతి సిమెంట్‌ కర్మాగారాన్ని కడప వైఎస్సార్‌ జిల్లాలోని నల్లలింగాయపల్లి గ్రామంలో స్థాపించినట్లు చెప్పారు. తాపీ మేస్త్రీల సంక్షేమం కోసం భారతి సిమెంట్‌ యాజమాన్యం ప్రతి కార్మికుడికి రూ.లక్ష బీమా అందిస్తుందన్నారు. పనులు చేసే సమయంలో ప్రమాదవశాత్తూ  మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ.లక్ష బీమా సౌకర్యాన్ని కల్పిస్తుందన్నారు. భారతి సిమెంట్‌ నాణ్యతా ప్రమాణాలపై టెక్నికల్‌ ఆఫీసర్‌ కిరణ్‌ కుమార్, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సమావేశంలో స్థానిక డీలర్లు సర్దేసాయి గిరి, మల్లికార్జున, రమేష్‌ రెడ్డి, వినోద్ పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు