భాస్కర్‌రాజుకు విద్యాశిరోమణి పురస్కారం

19 Sep, 2016 17:37 IST|Sakshi
విజయవాడలో విద్యాశిరోమణి పురస్కారాన్ని అందుకున్న సంగమరాజు భాస్కర్‌రాజు
తిరుపతి ఎడ్యుకేషన్‌ : తిరుపతిలోని మేక్‌ మై బేబి జీనియస్‌ విద్యా సంస్థ డైరెక్టర్, చేతి రాత నిపుణులు సంగమరాజు భాస్కర్‌రాజు విద్యాశిరోమణి పురస్కారం అందుకున్నారు. విద్యారంగంలో ఆయన సేవలను గుర్తించి స్కోర్‌ మోర్‌ ఫౌండేషన్‌(ఎస్‌ఎంఎఫ్‌) సంస్థ ఈ పురస్కారాన్ని అందజేసింది. విజయవాడలో ఆదివారం సాయంత్రం ఎస్‌ఎంఎఫ్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు చేతుల మీదుగా విద్యాశిరోమణి పురస్కారాన్ని భాస్కర్‌రాజు అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ తన బాధ్యతలను ఈ పురస్కారం రెట్టింపు  చేసిందని తెలిపారు.  
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు