భూకబ్జాదారులపై చర్యలకు డిమాండ్‌

2 Nov, 2016 00:07 IST|Sakshi
భూకబ్జాదారులపై చర్యలకు డిమాండ్‌

 పోరుమామిళ్ల:  మండలంలో ప్రభుత్వ భూములు అక్రమణకు గురయ్యాయి. అక్రమార్కులు అంతటితో ఆగక  చెరువులు, కుంటలు కూడా కబ్జాచేశారు. అలాంటి భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా సమితి సభ్యులు వీరశేఖర్, చంద్రశేఖర్‌ మంగళవారం పోరుమామిళ్లకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది అండతోనే ఆక్రమణలు పెరిగుతున్నాయన్నారు. ఆక్రమించుకున్న భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా సిబ్బంది కళ్లప్పగించి చూస్తున్నారే తప్పచర్యలు లేవన్నారు.      ఇంటిస్థలం కోసం పేదలు దరఖాస్తు చేసుకొని సంవత్సరాల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు న్యాయం చేయడం లేదని   వివరించారు. విసుగు చెందిన పేదలు సర్వేనంబరు 1008లో గుడిసెలు వేసుకున్నారని అక్కడ వారికి పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ నాయకుల విజ్ఞప్తి మేరకు కలెక్టర్‌ బయటకు వచ్చి కార్యాలయం ముందు కూర్చున్న పేదలతో మాట్లాడారు. ఆక్రమణలకు అనుమతి ఇవ్వమని, ఎక్కడ ఎవరు ఆక్రమణకు పాల్పడ్డా సహించమన్నారు.  అర్హులైన పేదల గురించి విచారించి రెండునెలల్లో  న్యాయం చేస్తామన్నారు.కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యుడు జకరయ్య, మండల కార్యదర్శి సుబ్రమణ్యం, నాయకులు బాలు, మస్తాన్, సోమయ్య, మత్తయ్య, షఫి, ఫిరోజ్, చెన్నయ్య, విశ్వాసమ్మ, తదితరులున్నారు.
 

మరిన్ని వార్తలు