ఆ జీవోపై ఎందుకు స్పందించ లేదు ?

3 Jan, 2016 14:10 IST|Sakshi
ఆ జీవోపై ఎందుకు స్పందించ లేదు ?

కర్నూలు : తన నియోజకవర్గంలో టీడీపీ నేత పేరుతో నిధులివ్వడం సమంజసమా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రశ్నించారు. ఆదివారం కర్నూలు నగరంలో భూమా అఖిల ప్రియ విలేకర్లతో మాట్లాడుతూ... సర్పంచ్గా కూడా గెలవలేని వ్యక్తికి రూ. 2 కోట్లు నిధులిచ్చారని ఆమె ఆరోపించారు. టీడీపీ నేత గంగుల ప్రభాకర్రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అని టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొందని మండిపడ్డారు. ఈ అంశాన్ని తాము బహిర్గతం చేసిన ఇప్పటి వరకు ఈ జోవోపై ఎందుకు స్పందించలేదని టీడీపీ ప్రభుత్వాన్ని భూమా అఖిల ప్రియ నిలదీశారు.   

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజవకర్గానికి ఎమ్మెల్యేగా  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భూమా అఖిల ప్రియ ఎన్నికైన విషయం తెలిసిందే.  అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గంగుల ప్రభాకరరెడ్డినే ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పేర్కొంటూ... ఆయన సిఫార్సుల మేరకు నియోజకవర్గంలోని 59 పనులకు రూ. 2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రణాళిక శాఖ గురువారం జీవో-698 విడుదల చేసింది.  ఈ నేపథ్యంలో భూమా అఖిల ప్రియ పైవిధంగా స్పందించారు.

మరిన్ని వార్తలు