లడ్డూ కావాలా ..గణనాథా!

3 Sep, 2016 23:35 IST|Sakshi
లడ్డూ కావాలా ..గణనాథా!
వినాయక చవితి ... ప్రకృతితో అనుబంధం ... పండ్లు, పత్రాలు, తోరణాలే గుర్తుకు వస్తాయి... పిండి వంటల్లోకి వస్తే ఉండ్రాళ్లు. ఇదంతా గతం. నేటితరం గణనాథులు కొంగొత్త అవతారాల్లో సాక్షాత్కరిస్తున్నారు. ఆ అలంకరణలకు అనుగుణంగా హైటెక్‌ పూజలు అందుకుంటున్నాడు ఆ పార్వతీ పుత్రుడు. విగ్రహం ఎత్తులోనే కాదు పెట్టే ప్రసాదంలోనూ పోటాపోటీయే. ఉండ్రాళ్ల స్థానంలో లడ్డూలు ప్రత్యక్షమయ్యాయి. ‘ఇంతింతై వటుడింతై..’ చందంగా కొండంతై ప్రపంచ రికార్డుల కోసం  పరుగులు తీస్తున్నాయి. ఇందుకు జిల్లాలోని మండపేట మండలం తాపేశ్వరం కొన్నేళ్లుగా వేదికవుతోంది. ఇక్కడి ప్రముఖ స్వీట్‌ సంస్థలు ‘దీక్షా’దక్షతలతో సృష్టిస్తున్న మహాలడ్డూలు భక్తులకు కను‘విందు’ చేస్తున్నాయి.
 
మరిన్ని వార్తలు