బికినీల సంస్కృతి మనది కాదు

11 Nov, 2016 06:46 IST|Sakshi
బికినీల సంస్కృతి మనది కాదు

కాంగ్రెస్ మహిళా విభాగం నిరసన ర్యాలీ
బీచ్‌లవ్ ఫెస్టివల్‌ను అడ్డుకుని తీరుతాం.. ఏబీవీపీ

బీచ్ ఫెస్టివల్ పై నిరసనలు మిన్నంటుతున్నాయి. పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారుు.భారతీయ సంస్కృతిపై దాడి అంటూ పలువురు మండిపడుతున్నారు. తక్షణమే బీచ్‌లవ్ ఫెస్టివల్ రద్దు చేయాలనే డిమాండ్ రోజురోజుకూ బలపడుతోంది. ప్రభుత్వం పంతంతో ముందుకెళితే ఎలాగైనా అడ్డుకుంటామని ప్రజాసంఘాలు,విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

డాబాగార్డెన్‌‌: బికినీల సంస్కృతి మాకొద్దంటూ కాంగ్రెస్ పార్టీ మహిళా భాగం..విషసంస్కృతిని ప్రోత్సహిస్తున్న బీచ్ లవ్ ఫెస్టివల్‌ను అడ్డుకుని తీరుతామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ), తక్షణమే రద్దు చేయాలంటూ ఉత్తరాంధ్ర  సంస్కృతి  పరిరక్షణ వేదిక నిరసన చేపట్టారుు. బీచ్‌లవ్ ఫెస్టివల్ ను వ్యతిరేకిస్తూ నగర కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం యల్లమ్మతోటలో గల పార్టీ కార్యాలయం నుంచి జగదాంబ జంక్షన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టగా..అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) డాబాగార్డెన్‌‌స అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. 

బికినీల సంస్కృతి మాకొద్దు.. : బికినీల సంస్కృతి మాకొద్ద ని నగర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి అన్నారు. మహిళా సాధికారత అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. మహిళలను అవమానపరిచే బీచ్ ఫెస్టివల్‌ను రద్దు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉత్తర నియోజకవర్గ ఇన్‌చార్జి గుంటూరు భారతి మాట్లాడుతూ పాశ్చత్య సంస్కృతి మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు యల్లపు రఘురాం, హైదరాలీ షింకా, ఆలేటి హేమలత, రజియాబేగం  పాల్గొన్నారు.

బీచ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటాం : విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్న బీచ్ లవ్ ఫెస్టివల్‌ను అడ్డుకుని తీరుతామని అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) హెచ్చరించింది. బీచ్‌లవ్ ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తూ డాబాగార్డెన్‌‌స అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అల్లూరి నడచిన భూమిపై అశ్లీలత రద్దు చేయాలని..యువతను అభివృద్ధి వైపు నడిపించాలి..కానీ ఆకర్షణల వైపు కాదని..బీచ్ ఫెస్టివల్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఏబీవీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి టి.ఎన్.రాజు, జిల్లా కన్వీనర్ ఎం.గణేష్, సిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నరేంద్ర మాట్లాడుతూ దేశ సంస్కృతిని కించపరుస్తూ పాశ్చాత్య సంస్కృతి ప్రోత్సహిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. అభివృద్ధి పేరిట మందు వ్యాపారం, అశ్లీల వాతావరణం సృష్టించడం టీడీపీ ప్రభుత్వానికి తగునా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మహేంద్ర, మౌనిక, రమ్య, లావణ్య అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు