మళ్లీ పాత కథే..?

10 Apr, 2017 12:39 IST|Sakshi
మళ్లీ పాత కథే..?

బీసీ హాస్టళ్లలో బయోమెట్రిక్ ఫెరుుల్
మళ్లీ వినిపించనున్న ఎస్సార్, ప్రెజెంట్ సార్ పదాలు
యంత్రాలు పని చేయడం లేదా.. ఉద్దేశపూర్వకంగానా..?

 
సిమ్‌లు రాలేదు..

9హాస్టల్స్‌లో బయెమెట్రిక్ విధానాన్ని ఆన్‌లైన్‌కు అనుసంధానం చేసేందుకు ట్యాబ్‌లు ఇచ్చారు. కానీ ఆ ట్యాబ్‌ల్లో వేసేందుకు సిమ్ కార్డులు రాలేదు. అలాగే వీటి కోసం మూడు నెట్‌వర్క్‌ల సిమ్ కార్డులు ఇచ్చారు. ఇందులో ఎరుుర్ టెల్ సిగ్నల్స్ ఉన్న ప్రాంతాలే ఎక్కువగా ఉన్నారుు. కానీ వచ్చిన సిమ్‌లు మాత్రం ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ కావడంతో ట్యాబ్‌ల్లో వేయలేదు. జిల్లాలోని 4 డివిజన్లలో ఒక్కో హాస్టల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించాల్సి ఉండగా అలా జరగలేదు.
 
విజయనగరం కంటోన్మెంట్ : సంక్షమే హాస్టళ్లలో బయోమెట్రిక్‌ను అమలు చేసి తద్వారా అక్రమాలకు చెక్ పెట్టాలన్న ఉన్నతాధికారుల ఆశయం నెరవేర లేదు. ఈ విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులు హాస్టళ్లకు ఆదేశాలిచ్చినప్పటికి ఆచరణకు మాత్రం అరుుష్టత వహిస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నారుు. 2 నెలల క్రితం జిల్లాకు 97 బయోమెట్రిక్ డివైస్‌లు రాగా వాటిలో 38 మెషీన్లు పనిచేయడం లేదు. మిగతా మెషీన్లకు సిమ్‌కార్డులు ఇవ్వలేదు. జిల్లాలో 88 బీసీ హాస్టల్స్ ఉండగా వీటిలో 28 కాలేజ్ విద్యార్థులవి. మిగిలిన 60 స్కూల్ విద్యార్థులవి. ఈ హాస్టళ్లలో హాజరును తప్పుగా చూపిస్తున్నారనే అనుమానాలు కలగడంతో పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు తలచారు. దీనిలో భాగంగా కార్వే సంస్థ ద్వారా జిల్లాకు బయోమెట్రిక్ పరికరాల్ని పంపిణీ చేశారు. సెప్టెంబర్ నాటికి జిల్లా వ్యాప్తంగా అమలు కావాల్సి ఉండగా ఎందుకో అమల్లోకి రాలేదు.

 రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా..
 జిల్లాలోని 60 బీసీ బాలుర హాస్టల్స్‌కు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడంతో పాటు జిల్లాలోని 2 రెసిడెన్షియల్ స్కూళ్లకూ ఒకేసారి ఈ బయోమెట్రిక్ డివైస్‌లు అమర్చాలని నిర్ణరుుంచారు. చీపురుపల్లి, కోరపు కొత్తవలసల్లో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలకు ఈ పరికరాలు పంపిణీ చేశారు. కానీ అక్కడ కూడా నేటికి ఈ విధానం అమలు చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ మెషీన్లు, పరికరాలు వచ్చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నారుు. అన్ని కార్యాలయాలు, సంస్థల్లోనూ బయోమెట్రిక్ విధానం సక్రమంగా పనిచేస్తుంటే  ఇక్కడే ఎందుకు పని చేయడం లేదన్న విమర్శలూ ఉన్నారుు.
 
జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తాం. కార్వే సంస్థ ప్రతినిధులు ఇదిగో అదిగో అంటున్నారు. త్వరలోనే వారితో సమావేశం ఏర్పాటు చేసి డెమో నిర్వహిస్తాం. అనంతరం వాటిని ఆయా వసతి గృహాలకు తరలించి సక్రమంగా పనిచేసేటట్లు చర్యలు తీసుకుంటాం.-    సీహెచ్. హరిప్రసాద్, డీబీసీడబ్లూ ్యఓ, విజయనగరం.

మరిన్ని వార్తలు