కళాశాలల్లోబయోమెట్రిక్

7 Jul, 2016 02:14 IST|Sakshi
కళాశాలల్లోబయోమెట్రిక్

పెరగనున్న విద్యార్థుల హాజరు శాతం
సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు

చేవెళ్ల: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది నుంచి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. సిబ్బంది, విద్యార్థుల హాజరులో మరింత పాదర్శకత  కోసం ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 22 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నారుు. ఇవి కాకుండా ఐదు ఎరుుడెడ్, 12 ఆదర్శ జూనియర్ కళాశాలలు పనిచేస్తున్నాయి. ఈ కళాశాలల్లో సుమారు 15వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత నెలలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. బుధవారం నుంచి అధ్యాపకులు, విద్యార్థులు బయోమెట్రిక్ ద్వారా హాజరుశాతాన్ని నమోదు చేసుకున్నారు. 

ప్రతి కళాశాలలో 4 సీసీన కెమెరాలు, బయోమెట్రిక్ పరికరం
ప్రతి జూనియర్ కళాశాలలో నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చేవెళ్ల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గదిలో, కళాశాల ముఖద్వారం వద్ద (ఎంట్రెన్ ్స), స్టాఫ్ రూం, ఒకేషన్ లో బిల్డింగ్‌లో ఒకటి చొప్పున ఏర్పాటుచేశారు.  భద్రత పరంగా కూడా సీసీ కెమెరాలు ఉపయోగపడనున్నాయి. సీసీ కెమెరాల పుటేజీలను ప్రిన్సిపాల్ గదిలో నుంచి పర్యవేక్షించవచ్చు.

పెరగనున్న హాజరు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకులు, విద్యార్థులు సమయపాలన పాటించడానికి బయోమెట్రిక్ విధానం ఉపకరించనుంది. ఉదయం 9:45 గంటలకు కళాశాల ప్రారంభం కానుంది. ఆలోపే.. అంటే 9.30 నుంచి 9.40 వరకు మాత్రమే బయోమెట్రిక్ యంత్రం ద్వారా హాజరు నమోదుచేయాల్సి ఉంటుంది. కళాశాలల వేళలు ముగిసే సమయానికి సాయంత్రం 3.50 నిమిషాలనుంచి 4 గంటలవరకు తిరిగి వెళ్లేటప్పుడు ఈ యంత్రం ద్వారా వేలిముద్రను వేయాల్సి ఉంటుందని ఇంటర్‌బోర్డు నిబంధనల్లో పొందుపరిచారు. అధ్యాపకులతోపాటుగా ఇతర సిబ్బంది, కాంట్రాక్టు లెక్చరర్లు, విద్యార్థులు కూడా బయోమెట్రిక్ పరికరంలో హాజరును నమోదుచేసుకోవాలి.

విద్యార్థుల హాజరుశాతం మెరుగు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ యంత్రం ద్వారా అధ్యాపకులు, విద్యార్థులలో జవాబుదారీతనం, బాధ్యత మరింత పెరుగుతుంది. విద్యార్థులు హాజరుశాతం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రతిష్ట పెరుగుతుంది. ఇది మంచి ప్రయోగం. సత్ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నాం.
- ఎం.శ్రీనివాస్, ప్రిన్సిపాల్, చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా