శాంతిభద్రతల పరిరక్షణలో బీజేపీ విఫలం

21 Sep, 2016 23:34 IST|Sakshi
ర్యాలీ చేస్తున్న వామపక్ష సంఘాల నేతలు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శాంతిభద్రతల విషయంలో బీజేపీ తీరు సక్రమంగా లేకపోవడం వల్లే కశ్మీర్‌ మరోసారి నెత్తురోడిందని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసి జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌ అన్నారు. కశ్మీర్‌లో దాడులను నిరసిస్తూ బుధవారం శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్‌ కూడలిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీర్‌లో అల్లర్లు జరుగుతున్నా ప్రధాని పట్టించుకోవడం లేదని, ఇటువంటి పాలకులను జమ్ముకశ్మీర్‌ ప్రజలు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. కశ్మీర్‌లో భారత ప్రభుత్వ సైనిక దమనఖాండను నిలిపివేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, సెమినార్లు జరపాలని సీపీఐ (ఎమ్‌ఎల్‌) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు నేతింటి నీలంరాజు, ఎన్‌.వెంకటరావు, ఎస్‌.కృష్ణవేణి, బి.భాస్కరరావు, మార్పు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు