నేతల ‘నోటు’మాట

16 Nov, 2016 23:59 IST|Sakshi
  • కాలు కదపకుండా వైట్‌ చేసేస్తున్నారు
  • వాణిజ్య బ్యాంకులకు, మద్యం దుకాణాలకు టార్గెట్లు
  • అన్నవరం సత్తెన్ననూ వదలడం లేదు
  • ‘పచ్చ’ నేతల నోట్ల దందా...
  • సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    ‘శతకోటి దర్రిదాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి ’పచ్చ’ నేతలు సవాలక్ష దారులు వెతుకుతున్నారు. పెద్దనోట్ల రద్దుతో దేశమంతా అల్లాడిపోతుంటే తునిలో అధికార పార్టీ ముఖ్యనేత మాత్రం కాలుకదపకుండా అక్రమార్జనను సక్రమం చేసుకుంటున్నారు. సామాన్యుడు బ్యాంకు వద్ద  రెండు గంటలు క్యూలో నిలుచున్నా రూ.2000లు డ్రా చేసుకోవడం గగనమైపోతోంది. అటువంటిది అధికారాన్ని అడ్డంపెట్టుకుని కాలుమీద కాలేసుకుని పక్కా ప్రణాళికతో ఒక తెలుగు తమ్ముడు నల్లడబ్బును తెల్ల డబ్బుగా మార్చేసుకుంటున్నాడు. నోట్ల మారకం కోసం బ్యాంకులు, మద్యం దుకాణాలే కాదు చివరకు పుణ్య క్షేత్రాన్ని కూడా విడిచిపెట్ట లేదు. జిల్లాలో పలు ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా ఇదే పనిలో ఉన్నా, హవా అంతా తునిలో ముఖ్య నేతదేనంటున్నారు. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పెద్ద నోట్లు తీసుకుని కమీష¯ŒS ప్రాతిపదికన కొత్త నోట్లు మారకం జరుగుతోంది.
    బ్యాంకులకు ఇలా...
    తుని పరిసర ప్రాంతాల్లోని బ్యాంకులు, మద్యం దుకాణాలు, వడ్డీ వ్యాపారులను బెదిరింపులతో కరెన్సీ మార్పిడి చేసుకుంటున్నారు. బ్యాంకులకైతే ఒక లెక్క, మద్యం 
    దుకాణాలకైతే మరో లెక్కగా నడుస్తోంది. తుని పట్టణం లో వాణిజ్య బ్యాంకు బ్రాంచీలు 24 వరకు ఉన్నాయి. ఇంతవరకు రైతులకు, నిరుద్యోగులకు రుణాలు ఇవ్వాల ని బ్యాంకులకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్థేశించడం చూ శాం. కానీ అక్కడ మాత్రం నల్లడబ్బు తెల్లడబ్బుగా మా ర్చుకునేందుకు బ్యాంకుల వారీగా టార్గెట్‌లు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. బ్యాంకులో నల్లధనాన్ని మా ర్చుకోవడానికి అక్కడ రెండు పద్ధతులు అనుసరిస్తున్నా రు. ఎంపిక చేసిన 40 మంది తమ అనుచరులను ప్రతి రోజూ బ్యాంకుకు పంపించడం ... పద్ధతి ప్రకారం అం దరితోపాటు వారు కూడా ఆధార్‌కార్డు జిరాక్సుతో క్యూ లై¯ŒSలోనే వెళతారు. పాత నోట్లు తీసుకుని జమ చేస్తారు. అందరితో సమానంగానే తిరిగి తలో ఒక రూ.4000లు డ్రా చేస్తారు. ఆ రకంగా ఒక్కో బ్యాంకులో లక్షన్నర మా రకం జరుపుతున్నారని లెక్క.  రెండో పద్ధతిలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో తమ అనుచరులకు గంపగుత్తగా ఆధార్‌ జిరాక్సు పత్రాలు ఇచ్చి పంపిస్తా రు. ఉదయం నుంచి ఖాతాదారులకు సర్థుబాటు (రూ.4000లు అడిగితే రూ.2000లు) చేస్తూ వచ్చిన దానిలో బ్యాలె¯Œ్స చూసుకుని ఈ ఆధార్‌ కార్డులకు సరిపడా మొత్తం ఆ ముఖ్యనేత అనుచరులకు ఇచ్చి తీరాల్సిందే. ఈ రకంగా సర్థుబాటు చేయడం తలకు మించిన భారంగా మారింది. అలాఅని ఆ సామ్రాజ్యంలో కాదనే ధైర్యం లేక సిబ్బంది గుండెలు బాదుకుంటున్నారు.
    మద్యం దుకాణాలకు ఇలా...
    మద్యం దుకాణాలకు కూడా రోజువారీ టార్గెట్లు నిర్దేశించారు. ఒక్కో దుకాణం నుంచి ప్రతి రోజు రూ.80 వేలు నుంచి రూ.లక్ష విలువైన వంద నోట్లు ఇచ్చి తీరాల్సిందే. అందుకే తుని పరిసర ప్రాంతాల్లోని మద్యం దుకాణాల్లో వంద నోట్లు తప్పనిసరి చేసేశారంటున్నారు. తమ్ముళ్ల దందా విషయం తెలియక ప్రతి రోజు వంద నోట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తామని మందుబాబులు దుకాణ నిర్వాహకులతో గొడవకు దిగుతున్నారు. తుని పరిసర ప్రాంతాల్లో 20 మద్యం దుకాణాల ద్వారా సుమారు రూ.20 లక్షలు మార్చేస్తున్నారంటున్నారు. ఎంఆర్‌పీ కంటే రూ.5లు పెంచి అమ్ముకునేందుకు లక్షలు సమర్పించుకుంటున్నా ఇప్పుడు కూడా ఇదేం దందా అని నిర్వాహకులు లబోదిబోమని ఒకరి గోడు మరొకరు చెప్పుకోవడం తప్ప చేయగలిగిందేమి ఉందని కిమ్మనడం లేదు. చివరకు బడా ఫైనా¯Œ్స వ్యాపారులను కూడా తమ్ముళ్లు విడిచిపెట్టడం లేదు. భవిష్యత్తులో ఐ.టి. సంబంధ ఇబ్బందులొస్తే అప్పుడు మా అవసరం రాదా అంటూ పరోక్ష బెదిరింపులకు దిగుతున్నారని తెలియవవచ్చింది. ఈ క్రమంలో వారి ద్వారా కూడా బ్లాక్‌ను వైట్‌ చేసుకుంటున్నారంటున్నారు. 
    సత్తెన్ననూ వదలడం లేదు...
    చివరకు అన్నవరం సత్తెన్నను కూడా విడిచిపెట్ట లేదు. కార్తిక మాసం కూడా వారికి కలిసి వచ్చింది. ఈ మాసంలో ఇరుగు, పొరుగు రాష్ట్రాల నుంచి లక్షల్లో వచ్చిన భక్తులు స్వామివారికి అదే స్థాయిలో లక్షలు కురిపించారు. కొండపై ప్రధానంగా లక్షలు కురిపించేది సన్నిధి కౌంటర్‌. పిల్లల అన్నప్రాసన మొదలు వాహన పూజ, రూ.2000లు వ్రతాల వరకు అన్నింటికీ అదే కౌంటర్‌. ఆ కౌంటర్‌లో కార్తిక మాసంలో నిత్యం సుమారుగా రూ.30, నుంచి రూ,40లక్షలు  వచ్చింది. ఆ కౌంటర్‌తోపాటు కొండపైన తన అనుచరుల వ్యాపారాల ద్వారా నోట్ల మార్పిడి చేసుకున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం. 
     
    నిబంధనలను అతిక్రమిస్తేప్రజలు తిరగబడతారు
    నాయకులు చెప్పినట్లుగా వ్యవహరిస్తే ప్రజలు బ్యాంకులపై తిరగబడతారు. నాయకులు చెప్పినట్టుగా బ్యాంక్‌ అధికారులు నడుచుకోవడం మంచి పద్ధతి కాదు. సామాన్యుడు రూ.రెండువేలు కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. బెదిరింపులకు భయపడకండి, ప్రజలు మీకు అండగా ఉంటారు. అటువంటిది నాయకులు సిఫార్సులతో నగదు మార్పిడి చేస్తే ప్రజలతో కలిసి మేం కూడా తిరుగుబాటు చేయాల్సి ఉంటుంది.     – దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే, తుని
     
మరిన్ని వార్తలు