నిప్పుల కొలిమి

18 Apr, 2017 21:59 IST|Sakshi
నిప్పుల కొలిమి

– డోన్‌లో అత్యధికంగా 45.14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
– రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఎండలు


కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. వడగాలుల తీవ్రత మరింత పెరిగింది. జాతీయ రహదారుల పొడవునా ఎండమావులు నీటి కుంటలను తలపిస్తున్నాయి. వాహన చోదకుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. వడదెబ్బ బారిన మృతి చెందిన వారి సంఖ్య ఇప్పటికే 30కి పైగా ఉండటం గమనార్హం. ఏప్రిల్‌ నెల మూడవ వారంలోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం డోన్‌లో 45.14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, నందవరం తదితర మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు పట్టణాల్లో ముఖ్యమైన రహదారులు కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఇలా..

ప్రాంతం             ఉష్ణోగ్రతలు

డోన్‌                     45.14
నందికొట్కూరు        44,6
నందవరం(నాగులదిన్నె)    44.01
మద్దికెర                43.74
చాగలమర్రి            43.66
పగిడ్యాల              43.54
కర్నూలు(బుధవారపేట)    42.33
 

మరిన్ని వార్తలు