రక్తదానానికి విశేష స్పందన

10 Aug, 2016 22:56 IST|Sakshi
రక్తదానానికి విశేష స్పందన
  •  ఒకే రోజు 1,523 మంది రక్తదానం
  •  నెల్లూరు(అర్బన్‌):
    స్థానిక రామలింగాపురంలో నేస్తం ఫౌండేషన్‌ అధ్యక్షుడు కోరెం ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో 1,523 మంది రక్తదానం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఈ  రక్తదాన శిబిరంలో 140 మంది మహిళలు పాల్గొనడం విశేషం.  యువజన సంక్షేమ కార్యాలయం సహకారం అందించింది. ఇండియన్‌ రెడ్‌క్రాస్, పెద్దాసుపత్రి, నారాయణ బ్లడ్‌ బ్యాంకులకు సేకరించిన రక్తాన్ని అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మేయర్‌ అబ్దుల్‌ అజీజ్, డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డిలు హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ నేస్తం ఫౌండేషన్‌ సేవలను అభినందించారు. రక్తదానం చేయడమంటే ప్రాణదానం చేయడమేనని తెలిపారు. ఇలాంటి సేవలు సామాజిక చైతన్యాన్ని కలిగిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనం రంగమయూర్‌రెడ్డి, సెట్నల్‌ సీఈవో డా.సి.వి.సుబ్రహ్మణ్యం, రాజకీయ నాయకులు నూనె మల్లిఖార్జున యాదవ్, యరబోలు రాజేష్, ముత్యాల చంద్రమోహన్, వేల్పుల మహేష్, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రక్తదాన మోటివేటర్‌ బయ్యా ప్రసాద్, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ డా.ఎ.వీ సుబ్రహ్మణ్యం, డీసీహెచ్‌ డాక్టర్‌ సుబ్బారావు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు