భక్తిశ్రద్ధలతో బోనాలు

31 Jul, 2016 20:09 IST|Sakshi
బెల్లంపల్లి : అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన బెల్లంపల్లిలో ఆదివారం భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాల జాతర నిర్వహించారు. మున్సిపాలిటీలోని 14, 15 వార్డుల పరిధిలో ఉన్న అంబేద్కర్‌ రడగంబాలబస్తీలో మహా బోనాల జాతరలో మహిళలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సునీతారాణి బో నమెత్తుకొని పోచమ్మ దేవాలయం వరకు ప్రదర్శన చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చల్లంగా చూడాలని గ్రామ దేవతను వేడుకున్నారు. తదనంతరం కోళ్లు, మేకలను బలిచ్చారు. 
ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో..
పట్టణంలోని కన్నాలబస్తీ రైల్వేఫై ్లఓవర్‌ బ్రిడ్జి వద్ద నుంచి కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, బజార్‌ ఏరియా, కాంటా చౌరస్తా, బెల్లంపల్లిబస్తీ మీదుగా పోశమ్మ గడ్డ వరకు మహిళలు బోనాలతో ప్రదర్శన సాగించారు. పోచమ్మ దేవాలయానికి చేరుకుని మహిళలు పూజలు నిర్వహించారు. అక్కడనే వంటవార్పు చేసుకొని విందు భోజనాలు ఆరగించారు.
              ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సునీతారాణి, ముదిరాజ్‌ సంఘం పట్టణ అధ్యక్షుడు పిట్టల రాజమల్లు, మహిళలు, కుల పెద్దలు , యువకులు పాల్గొన్నారు.
కాసిపేట : మండలంలోని సోమగూడెంలో ఆదివారం భక్తులు పోచమ్మ బోనాలు నిర్వహించారు. డప్పుచప్పుళ్లతో గ్రామస్తులు బోనాలతో పోచమ్మ ఆలయానికి తరలివెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. వీధి వీధిన కలిసికట్టుగా నిర్వహించడంతో గ్రామంలో పండగా వాతవరణం నెలకొంది.
 
>
మరిన్ని వార్తలు