ప్రమాదం జరిగితే ‘బోరు’మనాల్సిందే..?

20 Jul, 2016 22:03 IST|Sakshi
ప్రమాదం జరిగితే ‘బోరు’మనాల్సిందే..?
బోరుబావిలో పడి చిన్నారులు పడి మృత్యువాత పడుతున్నా అధికారులు, ప్రజలు నిర్లక్ష్యం వీడడం లేదు. బోరుబావిలో చిన్నారి పడ్డప్పుడు హడావిడి చేసే అధికారులు, పాలకులు తర్వాత పైకప్పు లేని బోరుబావుల మూసివేతపై గానీ, ప్రమాదాలపై అవగాహన కల్పించడంలో గానీ అలసత్వం ప్రదర్శిస్తున్నారు అనడానికి నిదర్శనం ఇదిగో..! పై చిత్రం.
            మండలంలోని బొత్తపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో వేసిన బోరుబావి నోరు తెరుచుకునే ఉంది. పాఠశాల ఆవరణలో నిత్యం ఆటలు ఆడుతున్నారు. ప్రతీ సారి ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే పాలకులు, అధికారులు ఇప్పుడే స్పందించి బోరుబావిని పూడ్చి వేయడమో లేక పైకప్పు ఏర్పాటు చేయడమో చేయాలి. లేకుంటే ప్రమాదం జరిగిన తర్వాత ‘బోరు’మనాల్సిందే.... – దహెగాం
 
మరిన్ని వార్తలు