విద్యార్థుల చేతుల్లోనే దేశాభివృధ్ధి

24 Feb, 2017 00:01 IST|Sakshi
విద్యార్థుల చేతుల్లోనే దేశాభివృధ్ధి

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : దేశాభివృద్ధి విద్యార్థుల చేతుల్లోనే ఉందని మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు షేకన్న తెలిపారు. గురువారం స్థానిక ఇండోర్‌ స్టేడియంలో సైనికుల సహాయార్థం అనంతపురం జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బాక్సింగ్‌ టోర్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమానికి ఆయనతో పాటు కార్యదర్శి తిమ్మారెడ్డి, సభ్యులు పెంచలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పోలీస్‌ వ్యవస్థ అంతర్గతంగాను, ఆర్మీ వ్యవస్థ బహిర్గతంగా దేశానికి రక్షణ అందిస్తున్నాయన్నారు.

దేశ సంరక్షణకు లింగభేదం అక్కర్లేదని చెప్పారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. టోర్నీ ద్వారా సమకూరిన నగదును మాజీ సైనికులకు జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ చైర్మెన్‌ హరికృష్ణ, కార్యదర్శి మహేష్‌ అందించారు. విజేతలకు ప్రశంసా పత్రాలలు అందజేశారు. అనంతరం సబ్‌–జూనియర్‌ జిల్లా బాలుర జట్టును ఎంపిక చేశారు. వీరు విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి సబ్‌–జూనియర్‌ క్రీడా పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో అక్బర్‌ అలీ, వేదవతి, ఆర్చరీ అసోసియేషన్‌ కార్యదర్శి శివ పాల్గొన్నారు.
సబ్‌–జూనియర్‌ బాలుర జట్టు
34 కిలోల విభాగం–హరీష్, 40–యోగానంద, 42–మనోహర్, 44–వినయ్, 46–వెంకటేష్, 48–మదన్, 50–గోవర్ధన్, 53–నాగరాజు, 60–కిషోర్, 65–కిరణ్, 70–హాజి మలంగ్‌

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు