ఇంత కుప్పలో నాకు నప్పే చెప్పులెక్కడ?

30 Jul, 2015 13:19 IST|Sakshi

రాజమండ్రి: గోదావరి పుష్కరాల 12 రోజులూ కోట్లమంది స్నానమాచరించి, ఆ పుణ్యఫలం దక్కిందన్న తృప్తితో తిరిగి వెళ్లారు. పుష్కరాలు ముగిసి అయిదు రోజులైనా రాజమండ్రిలోని ఘాట్ల వద్ద ఇప్పటికీ అనేకులు నదిలో మునిగి తేలుతూనే ఉన్నారు. వారి లక్ష్యం పుణ్యఫలం మాత్రం కాదు..స్నానాల సందర్భంగా భక్తులు గోదారమ్మకు సమర్పించిన నాణేలు, వెండి, బంగారు ప్రతిమల వేట. అందుకోసం అయిస్కాంతాలు, చేటలు, ఇతర సాధనాలతో  రేవుల్లో దేవుతూనే ఉన్నారు.

మరికొందరు బడుగు జీవులు మాత్రం పుష్కర రద్దీలో భక్తలు విడిచిన వేలాది చెప్పుల్లో తమకు సరిపోయే 'జోడు' కోసం వెతుక్కుంటున్నారు. వీఐపీ ఘాట్, గౌతమి ఘాట్ల వద్ద భక్తులు విడిచి వెళ్లిన చెప్పులను పారిశుద్ధ్య సిబ్బంది ...ఇస్కాన్ ప్రాంతంలో గుట్టగా వేశారు. పట్టువదలని విక్రమార్కుడిలా ఆ గుట్టను గాలించిన ఓ బాలుడు చివరకి అనుకున్నది సాధించాడు. కొందరికి ఎంతసేపు వెతికినా నిరాశే మిగులుతోంది.



మరిన్ని వార్తలు