బోయ ఫెడరేషన్‌ ఏర్పాటు చేస్తాం

16 Oct, 2016 21:49 IST|Sakshi
బోయ ఫెడరేషన్‌ ఏర్పాటు చేస్తాం
విజయవాడ (భవానీపురం): బోయల సంక్షేమానికి రూ.48 కోట్లతో బోయ ఫెడరేషన్‌తో పాటు దానికి పాలకవర్గాన్నికూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని బీసీ, ఎక్సైజ్, చేనేత మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బీసీ శాఖ ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మహర్షి వాల్మీకీ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇకపై ప్రతి ఏడాది ఆశ్వీయుజ పౌర్ణమి రోజున వాల్మీకి జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామన్నారు. బీసీ వర్గాల్లోని యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ పరిశ్రమల పార్క్‌ ఏర్పాటు చేయనున్నాయని చెప్పారు.  జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ గంధం చంద్రుడు మాట్లాడుతూ మహర్షి వాల్మీకి 5వేల ఏళ్ల క్రితమే రామాయణ మహాకావ్యాన్ని రచించారని, ఆయనను ఆదర్శంగా తీసుకుని చదువు ప్రాముఖ్యతను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.అనంతరామ్, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ హర్షవర్ధన్, వాల్మీకి బోయ సంక్షేమ సంఘం కన్వీనర్‌ ఎమ్‌ జగదీష్, వాల్మీకి బోయ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కన్వీనర్‌ సీహెచ్‌ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు