బీపీటీ–2 వరి రకాన్ని అమ్మడం నేరం

13 Feb, 2017 23:05 IST|Sakshi
నంద్యాల అర్బన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు లేని బీపీటీ–2 అనే వరి రకాన్ని అమ్మడం చట్టరీత్యా నేరమని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ సంచాలకులు డాక్టర్‌ గోపాల్‌రెడ్డి తెలిపారు. స్థానిక కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది ఆచార్య ఎన్‌.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన వరి రకం కాదన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా నంద్యాల పరిసర ప్రాంతాల్లోని రైతులు కొందరు ఈ రకాన్ని సాగు చేస్తున్నారని చెప్పారు. పంట సాగు వలన వచ్చే సమస్యలకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖలు బాధ్యత వహించబోవన్నారు. విశ్వవిద్యాలయం రూపొందించిన బీపీటీ–5204 సాగుచేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. విత్తనం కొనేటప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు. పంట కాలం పూర్తయ్యేవరకు రసీదు ఉంచుకోవాలని సూచించారు.   
 
మరిన్ని వార్తలు