బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

28 Jul, 2016 00:41 IST|Sakshi
బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
వరంగల్‌ అర్బన్‌ : బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర నూతన కార్యవర్గం, జిల్లా అధ్యక్షుల ఎ న్నికను బుధవారం నగరంలోని రాజరాజేశ్వరి ఆలయంలో బ్యాలెట్‌ పద్ధతిన నిర్వహించిన ట్లు ఎన్నికల అధికారి వారణాసి పవన్‌కుమార్‌ వెల్లడించారు. సమితి గౌరవాధ్యక్షులుగా ప్రభుత్వ సలహాదారు కె.వి రమణాచారి, సముద్రాల వేణుగోపాలచారి, గంగు ఉపేంద్రశర్మలను ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నిట్టూరి సతీష్‌శర్మ(కరీంనగర్‌) ప్రధాన కార్యదర్శిగా కోటి రామేశ్వర్‌రావు(మెదక్‌), ఉపాధ్యక్షులుగా భాస్కరభట్ల రామశర్మ(హైదరాబాద్‌), కార్యదర్శిగా కొండపాక సత్యనారాయణ చార్యులు(కరీంనగర్‌), కోశాధికారిగా అనిల్‌ కుమార్‌(నిజామాబాద్‌) ఎన్నికయ్యా రు. సేవా సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా గంగు రజితాశర్మ(వరంగల్‌), ప్రధాన కార్యదర్శిగా కొండూరి నాగరాణి(కరీంనగర్‌)లను ఎన్నుకున్నారు. పది జిల్లాల అధ్యక్షులను కూడా ఎన్నుకున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ అ ధ్యక్షుడిగా ఆరుట్ల కరుణాకరాచార్యులు, రం గారెడ్డి జిల్లా అధ్యక్షుyì గా కులకర్ని మంగేశ్‌ శర్మ, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా ఐనవోలు వెంకట సత్యమోహన్, గ్రేటర్‌ వరంగల్‌ అధ్యక్షుడిగా వల్లూరి పవన్‌కుమార్, అదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా సంఘంబట్ల నరహరిశర్మ, ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పచ్చ శ్రీనివాస్‌రావు, మెదక్‌ జిల్లా అధ్యక్షుడిగా మంగు రాధాకిషన్‌ రావు, నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా రెంజల్‌కర్‌ దివాకర్, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా రవీందర్‌రావును ఎన్నుకున్నట్లు పవన్‌కుమార్‌ వెల్లడించారు. అనంతరం బ్రాహ్మణ సేవా సమితి గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ బ్రాహ్మణుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ రూ.100 కోట్లు కేటాయించారని చెప్పారు. రాష్ట్రంలో16 లక్షల బ్రాహ్మణ కు టుంబాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయని తెలిపారు. బ్రాహ్మణయిజంపై ఇటీవల ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య అర్థం లేని విమర్శలు చేస్తున్నారని, అతడిపై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.  
మరిన్ని వార్తలు