దొంగలకు బ్రేక్‌

20 Aug, 2016 22:24 IST|Sakshi
దొంగలకు బ్రేక్‌
 పుష్కరాల్లో తగ్గిన చోరుల బెడద 
 సీపీ సవాంగ్‌ పక్కా వ్యూహం 
 సీసీ కెమెరాలు, నిఘాతో 
క్రిమినల్స్‌కు చెక్‌ 
విజయవాడ: 
కృష్ణా పుష్కరాల్లో క్రిమినల్‌ గ్యాంగులపై పోలీసులు పంజా విసిరారు. పోలీసు కమిషనర్‌ డి.గౌతం సవాంగ్‌ నాయకత్వంలో పోలీసుల దాడులకు ప్రముఖ క్రిమినల్‌గ్యాంగులు హ్యాండ్‌సప్‌ అనక తప్పలేదు. వివరాల్లోకి వెళ్తే వేలాది మంది హాజరయ్యే పుష్కరాల్లో దోపిడీల పర్వానికి తెలుగు రాష్ట్రాలతో పాటు  దేశంలో 12 రాష్ట్రాల నుంచి 20కిపైగా దొంగల ముఠాలు విజయవాడపైకి దండెత్తాయి. పుష్కరాల ప్రారంభం నుంచే సిటీలోని ఘాట్లు, రద్దీ ప్రదేశాల్లో సంచరిస్తూ భక్తుల సొమ్మును దోచుకోవడంతో కలకలం రేగింది. సవాల్‌గా తీసుకున్న సీపీ సవాంగ్‌  పక్కా ప్రణాళికతో క్రిమినల్స్‌కు చెక్‌ పెట్టారు.
సీసీ కెమెరాలతో నిరంతర నిఘా 
సీసీ కెమెరాల వ్యవస్థతో పోలీసుల పని సులువైంది. కెమెరాల ద్వారా కదలికలను పసిగడుతూ గత 9రోజుల్లో నగరంలో సీసీఎస్‌ బలగాలు వివిద రాష్ట్రాలకు చెందిన 115 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 49 మంది మహిళలు ఉన్నారు. తమిళనాడు 2, , ఢిల్లీకి చెందిన 1,  తెలంగాణ  2 రాష్ట్రానికి చెందిన  3, , ఒడిశా 3, పశ్చిమ బెంగాల్‌ నుంచి 4,  ఉత్తరప్రదేశ్‌ నుంచి 1,  మహారాష్ట్ర నుంచి 3,  మధ్యప్రదేశ్‌ నుంచి  1 గ్యాంగు పట్టుబడ్డాయి.  వీరిలో కొందరు నేరం చేస్తూ  దొరికిపోగా,మరికొందరు అనుమానాస్పదంగా తిరుగుతూ పట్టుబడ్డారు. వీరందరూ ఆయా రాష్ట్రాల్లో క్రిమినల్స్‌గా గుర్తింపు ఉన్నట్లు సీపీ సవాంగ్‌ వివరించారు. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం 13 కేసులు పెట్టి 11 మంది అంతరాష్ట్ర నేరస్తులను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో ఒకరు పూజారి వేషధారణలో ఉండగా, మరొకరు హోంగార్డు వేషంలో దొంగతనం చేయటానికి రావడం గమనార్హం. నగలు దోచుకునేందుకు ఉపయోగించే కట్టర్లను దొంగల వద్ద పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. వందలాది మంది మఫ్టీ పోలీసులు దొంగల జాడకోసం నిరంతరం గాలిస్తూనే ఉన్నారు. దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడటం, రసాయనాలు జల్లి, మత్తుమందులు జల్లి చోరీలకు పాల్పడేందుకు వివిధ రాష్ట్రాల దొంగలు పుష్కరాలకు తరలి వచ్చారు. 
 
ముందస్తు వ్యూహంతో : సీపీ సవాంగ్‌ 
నేరాలు జరగకుండా పకడ్బందీ వ్యూహంతో దొంగతనాలను కట్టడి చేయగలిగామని సీపీ గౌతం సవాంగ్‌ ‘సాక్షి’కి చెప్పారు. రైల్వేస్టేషన్‌ బస్టాండ్, స్నానఘట్టాల వద్ద ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన సీసీ పుటేజీల ఆధారంగా క్రిమినల్స్‌ను ముందస్తుగా అదుపులోకి తీసకున్నామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 49 కేసుల్లో రు. 16 లక్షల విలువైన సొత్తు చోరీ అయిందని తెలిపారు. కాగా పోలీసులు రెండు దఫాలుగా 19 మంది నేరగాళ్లను అరెస్టు చేసి రూ. 8.80 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. దొరికిన గ్యాంగులను పూర్తి స్థాయిలో విచారించి వారు నేరాలకు పాల్పడితే కేసులు పెడతామన్నారు. 
 
 
 
మరిన్ని వార్తలు