ప్రేమికుల రోజున రెండు ఇళ్లల్లో విషాదం

14 Feb, 2016 23:44 IST|Sakshi

తాండూరు: ప్రేమికుల రోజున రెండు ఇళ్లల్లో విషాదం చోటుచేసుకుంది. కాబోయే భార్యను కలుసుకునేందుకు వెళ్లిన యువకుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి... తాండూరు పట్టణంలోని షావుకార్‌పేట్‌కు చెందిన గంగాధర్(30)కు ఈనెల 11వ తేదీన వికారాబాద్‌కు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. అయితే ప్రేమికుల రోజును పురస్కరించుకొని కాబోయే భార్యను కలుసుకోవడానికి ఆదివారం గంగాధర్ వికారాబాద్ లోని యువతి ఇంటికి వెళ్లాడు.

అక్కడ ఉన్నట్టుండి కూప్పకూలిపోయి అతను మరణించడంతో విషాదం నెలకొంది. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు వికారాబాద్‌కు వెళ్లి మృతదేహాన్ని తాండూరుకు తీసుకువచ్చారు. మరికొద్ది రోజుల్లో వివాహం జరగనుండగా పెళ్లికుమారుడు చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో ఈ ఘటన విషాదాన్ని నింపింది.

మరిన్ని వార్తలు