ఆంగ్ల సేనలకు బొబ్బిలి ఆతిథ్యం

13 Aug, 2016 21:44 IST|Sakshi
సైనిక స్థావరంగా వినియోగించిన భవనం
 సంస్థానాధీశుల భవనాల్లో సైనిక స్థావరాలు
 
 
బొబ్బిలి: సంస్థానాలు.. రాజరికాలకే కాదు.. ఆంగ్ల సైనిక స్థావరాలకు కూడా బొబ్బిలి ఆతిథ్యమిచ్చింది. బొబ్బిలిలో సంస్థానాధీశులు రాజా కళాశాల మైదానంలో ఓ భవనాన్ని నిర్మించారు. 1938లో భారత్‌పై జపాన్‌ బాంబులు వేసిన రోజుల్లో బొబ్బిలి చేరుకున్న ఆంగ్ల సైనిక దళాలు ఈ భవనంలో ఉన్నాయి. అప్పటి కట్టడాలన్నింటిలోనూ సైనికులు దాదాపు ఆరుమాసాల పాటు ఉన్నారు. ఆ  సమయంలోనే బాడంగి వద్ద విమానాశ్రయాన్ని నిర్మించారు. స్వాతంత్య్రం రాకముందు ఇక్కడ సోషలిస్టు పార్టీ బలంగా ఉండేది. ఒకే వీధిలో సోషలిస్టు, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలుండేవి. 1936లో పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఇక్కడ సభ నిర్వహించారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న అయ్యగారి కుటుంబం ఇక్కడే నివసించేది. బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉన్న భవనానికి 1894లో మద్రాసు గవర్నరు లార్డ్‌ వెన్‌లాక్‌ శంకుస్థాపన చేశారు. దానికి గుర్తుగా ఆ భవనం, శిలాఫలకం ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
 
మరిన్ని వార్తలు