తమ్ముళ్ల తన్నులాట

25 Aug, 2016 01:15 IST|Sakshi
తమ్ముళ్ల తన్నులాట
– ఎస్‌ఎంసీ ఎన్నికల్లో  గొడవ
–రామిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి వర్గీయుల బాహాబాహీ
–ఎన్నికలు వాయిదా
 
మంత్రాలయం రూరల్‌: పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ) ఎన్నికల్లో తెలుగు తమ్మళ్లు తన్నుకున్నారు. బాహాబాహీకి దిగి మరోమారు విభేదాలను బయటపెట్టుకున్నారు. తమ్ముళ్ల తన్నులాటతో మాధవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఎన్నికలూ వాయిదా పడ్డాయి. మండల పరిధిలోని మాధవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు గతంలో కోరం లేని కారణంగా ఎన్నికలు వాయిదా పడిన విషయం విదితమే. బుధవారం తిరిగి కమిటీ ఎన్నిక జరిపారు. ఉదయాన్నే టీడీపీ సీనియర్‌ నేత రామిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజశేఖర్‌రెడ్డి వర్గీయులు గుంపులుగా పాఠశాలకు చేరుకున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులను మాత్రమే పాఠశాలలోకి అనుమతించారు. ఎన్నికల అధికారి జగదీష్‌ ఆధ్వర్యంలో 6వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ఎన్నికలు నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఏడో తరగతి విద్యార్థి తల్లితండ్రుల వివరాలను సేకరించే సమయంలో రాజశేఖర్‌రెడ్డి, రామిరెడ్డి వర్గీయులు ఒకరినొకరు కొట్టుకున్నారు. సీఐ నాగేశ్వర రావు, ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ ఇరువర్గాలను లాఠీలతో చెదరగొట్టారు. ఇరువర్గాలను కూర్చోబెట్టి చర్చించి ఎన్నికలు వాయిదా వేశారు.  
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రముఖ సింగర్‌ భార్య మృతి

‘రణరంగం’ను వదిలేసిన మాస్‌ హీరో

ఏఏ 19 : తెర మీదకు మరో టైటిల్‌

హ్యాపి బర్త్‌ డే అమ్మా..!

‘వాల్మీకి’ టీజర్‌ రెడీ!

సాహో కోసం...