బుద్ధుని జాతక కథల చిత్ర ప్రదర్శన

12 Dec, 2016 14:31 IST|Sakshi
బుద్ధుని జాతక కథల చిత్ర ప్రదర్శన
విజయపురి సౌత్‌: స్థానిక లాంచీస్టేషన్‌లో శుక్రవారం జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ జాయింట్‌ కలెక్టర్, టూరిజం ఇన్‌చార్జి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, అమరావతి బుద్ధ విగ్రహం రూపకర్త రేగుళ్ల మల్లికార్జునరావు బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించి ఆయన గీసిన చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాల కిందట ఏ ఆంధ్రప్రదేశలో బౌద్ధం పరిఢవిల్లిందని చెప్పారు. అప్పట్లోనే అమరావతిలోని బౌద్ధ స్థూపంపై ఆంధ్రులు బుద్దుని జీవిత కథలు, జాతక కథలు, ఆనాటి మానవ జీవనానికి సంబంధించిన శిల్పాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్రా శిల్పుల గొప్పతనం గురించి వారు చెక్కిన శిల్పాలను చిత్రాలుగా గీసి ఇప్పటికే సింగపూర్, చైనా, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో 75 ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలిపారు. లాంచీస్టేషన్‌లో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను పలువురు పర్యాటకులు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో లాంచీ యూనిట్‌ మేనేజర్‌ వి.సూర్యచందర్‌రావు, సిబ్బంది ఉన్నారు.
మరిన్ని వార్తలు