ప్రాణహితమే

15 Mar, 2016 03:15 IST|Sakshi
ప్రాణహితమే

బడ్జెట్‌పై మిశ్రమ స్పందన
‘ప్రాణహిత’కు రూ.685.30 కోట్లు
సింగూరుకు రూ.27.50 కోట్లు
వడివడిగా  ‘నిమ్జ్’ పనులు!
బాగుందన్న అధికార పార్టీ
మండిపడిన ప్రతిపక్ష పార్టీల నేతలు

 సిద్దిపేట: సాగునీటి రంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో పెద్దపీట వేసిన నేపథ్యంలో జిల్లాకు ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి. ప్రాణహితకు గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపులు తగ్గినా.. దీనికి ఎగువనున్న కాళేశ్వరానికి వేల కోట్లు కేటాయించడం దానికి అనుసంధానమై ఉండే ప్రాణహితకు మేలు చేసేదేనని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. అలాగే సింగూరుకు రూ.10.5 కోట్ల మేర కేటాయింపులు పెరగడం విశేషం. ప్రధానంగా కొన్ని రంగాలపైనే దృష్టి పెట్టిన ప్రభుత్వం.. మిగతా సంక్షేమ రంగాలకు కోత పెట్టిందని విపక్ష పార్టీలు అంటున్నాయి. వ్యవసాయం, రుణమాఫీ అంశాలపై స్పష్ట లేదని అవి ఆరోపిస్తున్నాయి. జిల్లా అనంతగిరి సమీపంలో ఒక బ్యారేజీ, చంద్లాపూర్‌వద్ద మరో బ్యారేజీ, సిద్దిపేట మండలం తడ్కపల్లి శివార్లలో భారీగా 52 టీఎంసీల నిల్వ సామర్ధ్యం ఉన్న కొమురవెళ్లి మల్లన్న సాగర్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పాములపర్తి వద్ద మరో 21 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజీలు నిర్మించి జిల్లాకు సాగు నీరందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. జిల్లాలో 10 నుంచి 15, 17-20, 23, 36 ప్యాకేజీల పేరిట పనులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రాజెక్టుల రీ డిజైన్ చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఆయా బ్యారేజీలకు సొరంగ మార్గాలు (టన్నెళ్లు) , కాలువల పనులు జరుగుతుండగా ఇటీవలే చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో భూసేకరణ పూర్తవటంతో అక్కడ నిర్మించతల పెట్టిన రంగనాయక సాగర్ ఎడమ కాలువ పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మిగిలిన బ్యారేజీలకు సంబంధించి భూసేకరణకు ప్రత్యేకంగా 5 రెవెన్యూ అధికారుల బృందాలను ఏర్పాటు చేసి సర్వే పనులను ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.685.3 కోట్లు కేటాయించడంతో పనులు ప్రారంభం కావడానికి మార్గం సుగమమైంది. కాని గత బడ్జెట్‌లో కంటే తక్కువగా కేటాయింపులు చేయడం పట్ల జిల్లా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  సింగూరుకురూ.10 కోట్లు అదనపు కేటాయింపు కాగా జిల్లాలోని మరో ప్రాజెక్టు అయిన సింగూరుకు గత బడ్జెట్ కంటే రూ.10.5 కోట్లు అదనం గా కేటాయించారు. గత బడ్జెట్‌లో సింగూరు ప్రాజెక్టుకు రూ.17 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.26.5 కోట్లు కేటాయించడం విశేషం.

 నిమ్జ్‌కు రూ.100 కోట్లు
జహీరాబాద్‌లో నెలకొల్పనున్న జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్)కు రూ.100 కోట్లు కేటాయించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించడం విశేషం. ఇది సాకారమైతే స్థానిక యువతకు పెద్దసంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ వడివడిగా సాగుతోంది. అలాగే ఏదైనా ఆకస్మిక ఘటనలు చోటుచేసుకున్నప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా జిల్లా ఎస్పీ వద్ద రూ.కోటి ఉంచాలనే సర్కారు నిర్ణయంపై పోలీసుల వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

 ప్రోత్సాహకాలే ప్రోత్సాహకాలు..
రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు రూ.500 కోట్లు కేటాయించిన నేపథ్యంలో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు గరిష్టంగా ప్రయోజనం కలగనుందని ఆయా మున్సిపాలిటీల పాలకవర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పట్టణాభివృద్ధికి, గ్రామీణాభివృద్ధికి నిధుల కేటాయింపుపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అలాగే క్రీడలను క్రమం తప్పకుండా నిర్వహించే వివిధ సంఘాలు, అసోసియేషన్లకు ప్రోత్సాహకాలు అందించాలనే నిర్ణయంపై ఆయా వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇది క్రీడలకు ప్రోత్సాహమిస్తుందని అంటున్నారు. అలాగే గ్రామాల్లో వైద్య సిబ్బందికి సైతం ప్రోత్సాహకాలు ప్రకటించడం పేదలకు వైద్య సేవలు మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. పండ్లు, కూరగాయల సాగు ప్రోత్సాహానికి వీలుగా హార్టికల్చర్ డెవలప్‌మెంట్ సొసైటీ ఏర్పాటు చేయాలనే నిర్ణయం.. జిల్లా రైతాంగానికి ఊరట కలిగించనుంది. ఇప్పటికే మెదక్ జిల్లా వెజిటబుల్ హబ్‌గా ఆవిర్భవించిన నేపథ్యంలో కూరగాయల రైతులకు ఇది మేలు చేయనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 ప్రాణ‘హిత’మేనా?
ప్రాణహిత - చేవెళ్ల (కాళేశ్వరం) పథకానికి కేటాయించిన నిధులపై పలు రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. సింగూరుకు సైతం అన్యాయం జరిగిందని వారంటున్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేయాలని సంకల్పించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత-చేవెళ్ల (కాళేశ్వరం) పథకం ప్రారంభించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో గతేడాది కంటే తక్కువ నిధులు కేటాయించింది. సోమవారం ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రూ.685.30 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం ఈ పథకానికి రూ.1515 కోట్లు కేటాయించారు. ఈ పథకంలో భాగంగా జిల్లాలో కరీంగనర్

మరిన్ని వార్తలు