పైసా ఇచ్చేది లేదు..

16 Jan, 2017 22:53 IST|Sakshi
పైసా ఇచ్చేది లేదు..
 • తేల్చిచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 
 • జేఎ¯ŒSటీయూకేలో ఆర్థిక సంక్షోభం 
 • నిధులు లేక నిలిచిన పనులు
 • పూర్తయిన భవనాలు ప్రారంభం కాని దుస్థితి
 • బాలాజీచెరువు (కాకినాడ సిటీ) : 
  ఎనిమిది జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్, ఫార్మసీ మేనేజ్‌మెంట్‌ కళాశాలలకు వేదికగా ఉన్న జేఎ¯ŒSటీయూకేలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. వర్సిటీగా ఆవిర్భవించి దాదాపు పదేళ్లు కావస్తున్నా ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి కావడం లేదు. వర్సిటీగా ప్రకటించిన మూడో సంవత్సరంలో విడుదలైన నిధులతో కొన్ని ఆధునిక భవనాలను నిర్మించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక లోటు పేరుతో వర్సిటీకి నిధులు ఇవ్వలేమని, ఉన్న వనరులతో అభివృద్ధి చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిíస్థితి ఏర్పడింది. దాదాపు మూడేళ్ల క్రితం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భవనాలను వినియోగంలోకి తీసుకురాగలిగితే గొప్ప విషయంగా వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి.
  ఇంజినీరింగ్‌ విద్యార్థులు వ్యాపారవేత్తలుగా  రాణించేలా  వారిని తీర్చిదిద్దడానికి  జేఎ¯ŒSటీయూకేలో ఏర్పాటు చేసిన డిజై¯ŒS ఇన్నోవేష¯ŒS రీసెర్చ్‌ కేంద్రం నేటికీ ప్రారంభం కాలేదు. విద్యార్థులు ఉత్తమ వ్యాపార వేత్తలుగా ఎదిగేందుకు అవసరమయ్యే సలహాలను ఇవ్వడానికి ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ  కేంద్రంలో సుమారు రూ.3.50 కోట్ల విలువైన పరికరాలు సమకూర్చారు. ఆంధ్రా ఎలక్ట్రానిక్స్, టీసీఎస్‌ తదితర సంస్థలు శిక్షణకు ముందుకు వచ్చాయి. ఈ భవన నిర్మాణం పూర్తయి ఎనిమిది నెలలైనా ప్రారంభించలేదు. దీంతో కొనుగోలు చేసిన పరికరాలు నిరుపయోగంగా మారాయి.
  విద్యార్థుల సౌకర్యార్థం స్టూడెంట్‌ ఎమినిటీ భవనం నిర్మించారు. బ్యాంకు, క్యాంటీన్, రీడింగ్‌రూమ్, బుక్‌స్టాల్‌ తదితర సదుపాయాలన్నీ ఒకేచోట ఉండేలా ఈ భవనాన్ని  నిర్మించారు. అయితే ఈ భవనంలో కేవలం బ్యాంకు  మాత్రమే ఏర్పాటు చేశారు. మరే సదుపాయాలు కల్పించకపోవడంతో ఆ భవనం  నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం క్యాంటిన్, బుక్‌స్టాల్‌  పాత భవనంలో ఇరుకుగదిలోనే నిర్వహిస్తున్నారు. వర్సిటీ అధికారులు ఇప్పటికైనా స్పందించి నిర్మించిన భవనాలనైనా వినియోగంలోకి తేవాలని  విద్యార్థులు కోరుతున్నారు.
   
  అందుబాటులోకి తెస్తాం..
  డిజై¯ŒS ఇన్నోవేష¯ŒS సెంటర్‌ను  ముఖ్యమంత్రితో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం.  నిర్మించిన స్టూడెంట్‌ ఎమినిటీ భవనంలో ప్రస్తుతానికి బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తునాం. మిగతావన్నీ ఇక్కడికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తాం.
  – వీఎస్‌ఎస్‌ కుమార్, జేఎ¯ŒSటీయూకే ఉపకులపతి
   
మరిన్ని వార్తలు