ముగిసిన ఎడ్ల పోటీలు

15 Oct, 2016 21:54 IST|Sakshi
ముగిసిన ఎడ్ల పోటీలు
కేసరపల్లి(గన్నవరం) : మండలంలోని కేసరపల్లిలో తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్లపోటీలు ఆదివారంతో ముగిశాయి. శ్రీవీరాంజనేయస్వామి, శ్రీషిర్డి సాయిబాబా దేవస్ధానముల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో జూనియర్, సబ్‌జూనియర్, సీనియర్స్‌ విభాగాల్లో ఎడ్లజతలు పోటపోటీగా బలప్రదర్శన చేశాయి. సబ్‌జూనియర్స్‌ విభాగంలో పెనమలూరుకు చెందిన డీవీఆర్‌ మెమోరియల్‌ దేవభక్తుని సుబ్బారావు ఎడ్లజత రికార్డు స్థాయిలో బండను నిర్ణీత వ్యవధిలో 4,086 దూరం లాగి ప్రధమ స్థానం సాధించాయి. గుంటూరు జిల్లా కొప్పురావూరుకు చెందిన తోట శ్రీనివాసరావు ఎడ్లజత 3,498 అడుగులతో ద్వితీయ స్థానం, గుణదలకు చెందిన మండవ వెంకటరత్నం ఎడ్లజత 3,477 అడుగులతో తతీయ స్థానంలో నిలిచాయి. తోట శ్రీనివాసరావుకు చెందిన మరో ఎడ్లజత 3,442 అడుగులతో నాల్గోవ స్థానం, మోపిదేవి మండలం బొబ్బర్లంకకి చెందిన కోనేరు నిరూప్‌ 3,369 అడుగులతో ఐదోవ స్థానం దక్కించుకున్నాయి. 
జూనియర్స్‌ విభాగంలోః
ఘంటసాలకు చెందిన గొర్రెపాటి నవనీత్‌కష్ణ ఎడ్లజత 3,300 అడుగులు బండనులాగి ప్రధమ స్థానం, మొవ్వకు చెందిన తాతినేని పిచ్చేశ్వరరావు ఎడ్లజత 2,853 అడుగులతో ద్వితీయం, డీవీఆర్‌ మెమోరియల్‌ దేవభక్తుని సుబ్బారావు ఎడ్లజత 1,500 అడుగులతో తతీయ స్ధానంలో నిలిచాయి. 
సీనియర్స్‌ విభాగంలోః
సీనియర్స్‌ విభాగంలో కష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన డీవీఆర్‌ మెమోరియల్‌ దేవభక్తుని సుబ్బారావు ఎడ్లజత నిర్ణీత సమయంలో బండను 2,400 అడుగులు దూరంలాగి ప్రధమ స్థానం సాధించాయి. గన్నవరానికి చెందిన కాసరనేని పవన్, గగన్‌చౌదరిల ఎడ్లజత బండను 2,278 అడుగుల దూరంలాగి ద్వితీయ స్థానం సాధించాయి. తెనాలికి చెందిన భట్టా నాగసాయినివేష్, గౌతమ్, నితిన్‌ల ఎడ్లజత 1,800 అడుగులతో తతీయ స్థానం సాధించాయి. గుణదలకు చెందిన మండవ వెంకటరత్నం ఎడ్లజత నాల్గవ స్థానం, మొవ్వకు చెందిన తాతినేని పిచ్చేశ్వరరావు ఎడ్లజత ఐదోవ స్థానంలో నిలిచాయి. ఎడ్లజతల నిర్వాహకులకు గన్నవరం పుర ప్రముఖులు కంఠమనేని శ్రీనివాసరావు ఆర్ధిక సౌజన్యంతో రూ. 1.60 లక్షల నగదును ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ చేతుల మీదుగా అందజేశారు. మాజీ ఎంపీపీ పొట్లూరి బసవరావు, వైస్‌ ఎంపీపీ గొంది పరందామయ్య, పారిశ్రామికవేత్త తియ్యగూర వీరారెడ్డి, నిర్వాహకులు మల్లంపాటి బాబూరావు, వింత సాంబిరెడ్డి, వాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు