గుండె పోటు వచ్చినా..

26 Aug, 2016 00:38 IST|Sakshi
గుండె పోటు వచ్చినా..

* బస్సును ఆపి 50 మందిని
* రక్షించిన బస్సు డ్రైవర్
* ఆస్పత్రికి తరలించేటప్పటికే మృతి

పలమనేరు: తనకు గుండెనొప్పి రావడంతో బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను క్షేమంగా కాపాడి తన ప్రాణాలకంటే ప్రయాణికుల ప్రాణాలే మిన్న అని భావించాడో డ్రైవర్. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వి. కోటలో గురువారం జరిగింది. కుప్పం నుంచి  సాయంత్రం 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ ప్రైవేటు బస్సు తమిళనాడులోని పేర్నంబట్‌కు బయలుదేరింది. డ్రైవర్ వెంకటేశ్ (45) బస్సును నడుపుతూ వి. కోటకు చేరుకోగానే గుండెనొప్పి వచ్చింది. దీంతో బస్సును పక్కన నిలిపివేసి కుప్పకూలాడు.

దీన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా అతను మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. గుండెపోటు వచ్చినా  తమ ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్ వెంకటేశ్ మృతదేహాన్ని చూసి ప్రయాణికులు సైతం క ంటనీరు పెట్టుకున్నారు.  డ్రైవర్ తన ప్రాణాలకన్నా ప్రయాణికుల ప్రాణాలకే విలువనిచ్చాడని, అతని వల్ల తమ ప్రాణాలు దక్కాయని అన్నారు.

>
మరిన్ని వార్తలు