ఇష్టా రాజ్యం

9 Jan, 2017 23:53 IST|Sakshi
ఇష్టా రాజ్యం

పండగకు బస్ చార్జీల బాదుడు  
రవాణాశాఖ మంత్రి హామీ నీటి మూటలే
ప్రైవేటు బస్సుల్లో 200 శాతం పెంపు     
ఆర్టీసీలో 50శాతం అదనం
హడలిపోతున్న ప్రయాణికులు

 
 పండగలకు ప్రయాణమంటేనే సామాన్య ప్రజలు హడలెత్తిపోతున్నారు. సంక్రాంతి పండగకు ఆర్టీసీ చార్జీలు పెంచబోమని సాక్షాత్తు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు హామీ ఇచ్చారు. అరుుతే మంత్రి హామీ ప్రకటనలకే పరిమితమైంది. ప్రైవేటు బస్సుల యజమానులు సాధారణ టికెట్‌పై 200 శాతం అదనంగా చార్జీని పెంచేశారు. మేము ఏమి తక్కువ కాదన్న చందంగా ఆర్టీసీ సాధారణ టికెట్‌పై స్పెషల్ బస్సుల పేరుతో అదనంగా 50 శాతం పెంచేసింది.
 
  నెల్లూరు(టౌన్): పండగకు బస్సు చార్జీలు అమాంతంగా పెరగడంతో దూర ప్రాంతాల నుం చి జిల్లాకు వచ్చే ప్రయాణికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉపాధి కో సం సుదూర ప్రాంతాలకు వెళ్లి సంపాందించుకున్న మొత్తంలో కొంత మొత్తం బస్ టికెట్లకు పోతుందని పలువురు ప్ర యాణికులు వాపోతున్నారు. ఇతర ప్రాం తాల నుంచి నెల్లూరుకు ఈ నెల 10 నుం చి 12 తేదీ వరకు, మళ్లీ నెల్లూరు నుంచి ఇతర ప్రాంతాలకు 15 నుంచి 17వ తేదీ వరకు ప్రయాణానికి డిమాండ్ ఉంటుంది.ఇప్పటికే ఆయా ప్రాంతాలకు బస్సులు సీట్లు ఫుల్ అరుునట్లు చెబుతున్నారు.

  నెల్లూరు నుంచి ప్రైవేటు బస్సులు సుమారు 70కు పైగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్ తదితర ప్రాంతాలకు ప్రతిరోజూ తిరుగుతుంటారుు. వీటితో పాటు విజయవాడ, గుంటూరు, వైజాగ్ నుంచి చెన్నై, బెంగళూరులకు పదుల సంఖ్యలో బస్సులు ప్రయాణికులను చేరవేస్తుంటారుు. జిల్లా నుంచి ఉద్యోగం, వ్యాపారం, బతుకుదెరువు కోసం ఎక్కువ మంది ప్రజలు హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, చెన్నై తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. ప్రధాన పండగలకు సొం త గ్రామాలుకు రావడం పరిపాటిగా మా రింది. అరుుతే సంక్రాంతి మూడు రోజులు పండగ కావడంతో ప్రతి ఒక్కరూ సొంత ఊరికి రావాలన్న ఆశను ప్రైవేటు, ఆర్టీసీ యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నారుు.  

 ప్రయాణికులను దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్
 ప్రైవేటు బస్సులు ఏసీ, స్లీపర్ పేరుతో సాధారణ టికెట్‌పై అదనంగా 200శాతం చార్జీలు పెంచగా, ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో టికెట్‌పై అదనంగా 50శాతం చార్జీలు పెంచి ప్రయాణికుల నుంచి అడ్డంగా దోచేసుకుంటున్నారనే ఆరోపణలున్నారుు.  

 చోద్యం చూస్తున్న అధికారులు
 ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు పెంచిన టికెట్ ధరలను ఆన్‌లైన్లో ఉంచినా చర్యలు తీసుకోవాల్సిన రవాణా అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలున్నారుు. కాంట్రాక్టు పద్ధతిన పర్మిట్ పొందిన ప్రైవేటు యాజమాన్యం స్టేజి క్యారేజీలుగా తిరుగుతున్నా చర్యలు నామమాత్రంగా ఉన్నారుు. నెలవారి అందుతున్న ముడుపులు కారణంగానే మిన్నకుంటున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నారుు. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే అధికశాతం ప్రైవే టు బస్సులను నడుపుతుండటంతో వాటి జోలికి వెళితే ఎలాంటి పరిస్ధితి ఎదుర్కొవాల్సి వస్తుందొనన్న భయంతో మామూళ్లతో సరిపుచ్చుకుంటున్నారనే ఆరోపణలున్నారుు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అధిక చార్జీల వసూళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.   
 
 మార్గదర్శకాలు రావాల్సి ఉంది
 ఇటీవలే ప్రైవేటు ట్రావెల్స్ యజమానులతో సమావేశం నిర్వహించి వారికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. కమిషనర్ నుంచి మాకు కూడా గైడ్‌లైన్‌‌స రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే వాటి ప్రకారం చర్యలు తీసుకుంటాం. నాలుగు రోజులక్రితం ప్రైవేటు బస్సులపై తనిఖీలు నిర్వహించి 30 కేసులు నమోదు చేశాం.                               
- ఎన్.శివరాంప్రసాద్,ఉపరవాణా కమిషనర్, రవాణాశాఖ

మరిన్ని వార్తలు