ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి

20 Dec, 2016 23:51 IST|Sakshi
డోన్‌ టౌన్‌: పట్టణంలోని పాత పోస్టుమార్టం కేంద్రం సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. సీసంగుంతల గ్రామానికి చెందిన సురేష్‌ (26) కొత్తపల్లె గ్రామ శివారులోని ఓ గ్రానైట్‌ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. మంగళవారం ఉదయం సొంత పనిపై డోన్‌కు వచ్చి స్వగ్రామానికి బైక్‌పై బయల్దేరాడు. పోస్టుమార్టం కేంద్రం వద్ద ధర్మవరం నుంచి శ్రీశైలం వెళ్తున్న బస్సు వేగంగా ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తండ్రి చిన్నన్న ఫిర్యాదు మేరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ రామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు డోన్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.    
 
మరిన్ని వార్తలు