బస్సు కండీషన్‌లో ఉండాల్సిందే...

18 Jul, 2016 15:57 IST|Sakshi
బహుమతి ప్రదానం
l గ్యారేజీ సిబ్బందికి అవగాహన 
l ఆర్టీసీ శ్రీకాకుళం రెండో డిపో మేనేజర్‌ అరుణకుమారి
 
 
శ్రీకాకుళం అర్బన్‌: ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు కండీషన్‌లో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత గ్యారేజీ సిబ్బందిపై ఉందని ఆర్టీసీ శ్రీకాకుళం రెండో డిపో మేనేజర్‌ నంబాళ్ల అరుణకుమారి అన్నారు. ప్రమాదరహిత వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు శ్రీకాకుళంలోని రెండో డిపో గ్యారేజీ ఆవరణలో మెయింటినెన్స్‌ డే నిర్వహించారు. 
 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బస్‌ కండిషన్, బ్రేక్‌లు, హెడ్‌లైట్‌ తదితరవన్నీ బాగుండేలా చూడాలని సూచించారు. హ్యాండ్‌బ్రేక్‌ కండిషన్‌ సరిగా ఉందా, లేదో చూసుకోవాలని, స్టీరింగ్‌ కండీషన్‌ సక్రమంగా ఉందో, లేదో చూడాలన్నారు. సేఫ్టీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గ్యారేజీ మెకానిక్‌లకు, సూపర్‌వైజర్‌లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎల్‌.రమణ(ఇంజన్‌ మెకానిక్‌), ఎం.రవికాంత్‌(బ్రేక్‌ మెకానిక్‌), ఎస్‌.కోటేశ్వరరావు(బ్రేక్‌ మెకానిక్‌), జె.నూకరాజు(టైర్‌ మెకానిక్‌). బి.సతీష్‌బాబు(ఎలక్రీ్టషియన్‌), జి.కాళి(ఈఓసి మెకానిక్‌), కేవీ రావు(స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌), జేవీకే రాజు(లీడింగ్‌ హ్యాండ్‌) తదితర ఉత్తమ గ్యారేజీ మెకానిక్, సూపర్‌వైజర్‌లకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ రెండో డిపో అసిస్టెంట్‌ మేనేజర్, ఎం.ఎఫ్‌ తదితరులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు