ప్రారంభానికి నోచుకోని బాలికల వసతిగృహం

20 Jul, 2016 19:55 IST|Sakshi
ప్రారంభానికి నోచుకోని బాలికల వసతిగృహం

–రూ.1.30కోట్ల నిధులతో పూర్తయిన వసతిగృహాం భవనం
–రెండు వందల మంది బాలికలకు వసతి సౌకర్యం
–ఇబ్బందులు పడుతున్న విద్యార్ధులు
మునగాల: మండల కేంద్రంలో దాదాపు రూ.1.30కోట్ల నిధులతో నిర్మించిన ఆదర్శ పాఠశాల వసతి గృహాం నిర్మాణం పూర్తయినప్పటీకీ ప్రారంబానికి నోచుకోవడం లేదు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులు నానా ఇబ్బందులు పడుతున్నారు.   అన్ని సౌకర్యాలతో కూడిన ఈ వసతి గృహాంలో దాదాపు  వంద మంది విద్యార్థినులకు వసతి సౌకర్యం కల్పించే వీలుంది. ఈ హాస్టల్‌లో 20 గదులున్నాయి. ఒక్కో గదికి నలుగురుకు ఉండే వీలు ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులు రెండు వందల మంది పైచిలుకే ఉన్నారు.   ప్రస్తుతం ఈ పాఠశాలకు ఇతర ప్రాంతాల నుంచి ఆటోలు, బస్సులు, సైకిళ్ల మీద విద్యార్థినులు నిత్యం పాఠశాలకు వచ్చి విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం ఆరంభంలో వసతి గృహాం ప్రారంభిస్తారనుకుంటే  అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. నీటి సరఫరా, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణంతో పాటు వసతి గృహాం చుట్టు ప్రహారీ గోడ నిర్మాణం కూడా పూర్తయింది. వీలైనంత త్వరలో వసతి గృహాన్ని ప్రారంభించి విద్యార్థినులను ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

నిత్యం ఇబ్బందులు పడుతున్నాం: శృతి తొమ్మిదో తరగతి,ఆకుపాముల
ప్రతిరోజు పాఠశాలకు పది కి.మీ.దూరంలో ఉన్న ఆకపాముల నుంచి మునగాల వరకు ఆర్టీసీ బస్సులో వచ్చి బస్టాప్‌ నుంచి కి.మీ.దూరం నడిచి పాఠశాలకు వస్తున్నాను. దీంతో ప్రతిరోజు పాఠశాల వచ్చిపోయేందుకు రెండు గంటల సమయం పడుతోంది. దీంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. వసతి గృహాం ప్రారంభించి ఇబ్బందులు తొలగించాలి.

వసతిగృహాన్ని తక్షణమే ప్రారంభించాలి: ప్రియాంక, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, కలకోవ
వసతిగృహాం నిర్మాణం పూర్తయినప్పటీకీ నేటికి ప్రారంభించకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నాం. తక్షణమే వసతిగృహాన్ని ప్రారంభించి విద్యార్థులను ఇబ్బందులను తొలగించాలి.

20రోజుల్లో ప్రారంభిస్తాం:  సాయిఈశ్వరి, పాఠశాల ప్రిన్సిపాల్‌
పాఠశాలకు అనుబంధంగా నిర్మించిన వసతి గృహాం నిర్మాణం పూర్తయింది. 20రోజుల్లో జిల్లా మంత్రిగారి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు  చేస్తున్నాం. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్ధినుల ఇబ్బందులు తొలగనున్నాయి. వసతి గృహానికి అవసరమైన సిబ్బంది నియామకానికి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం.
 

మరిన్ని వార్తలు