ఉత్కంఠ భరితంగా...

4 Sep, 2017 09:56 IST|Sakshi
ఉత్కంఠ భరితంగా...

పీఆర్‌టీయూ జిల్లా ఎన్నికలు
జిల్లా అధ్యక్షుడిగా బి.వి.రమణారావు,
ప్రధాన కార్యదర్శిగా నరేంద్రబాబు ఎన్నిక


నిర్మల్‌రూరల్‌: పీఆర్‌టీయూ జిల్లా ఎన్నికలు ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. నిర్మల్‌లోని దివ్య గార్డెన్స్‌లో జిల్లా కార్యవర్గ ఎన్నికలను ఓటింగ్‌ పద్ధతిన నిర్వహించారు. ఇందులో రెండు ప్యానెళ్లు పోటీ పడ్డాయి. బి.వి.రమణారావు వర్గం ఒక ప్యానెల్‌గా బరిలో దిగగా సుదర్శన్‌ మరో ప్యానెల్‌గా బరిలో దిగారు. 100 మంది సభ్యులు తమ ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. రమణారావు ప్యానెల్‌ నుంచి రమణారావు మాత్రమే గెలుపొందగా సుదర్శన్‌ ప్యానెల్‌ నుంచి సుదర్శన్‌ తప్ప మిగితా పోటీ చేసిన అభ్యర్థులందరూ గెలుపొందారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలను నిర్వహించారు. ఇరు ప్యానెళ్ల మధ్య పోటాపోటీ నెలకొంది.

రెండు ఓట్ల తేడాతో జిల్లా అధ్యక్షుడిగా రమణారావు
రెండు ఓట్ల తేడాతో జిల్లా అధ్యక్షుడిగా బి.వి.రమణరావు గెలుపొందారు. రమణారావుకు 51 ఓట్లు రాగా ప్రత్యర్థి అయిన సుదర్శన్‌కు 49 ఓట్లు లభించాయి. దీంతో ఎన్నికల పరిశీలకులు రమణారావు గెలుపొందినట్లు ప్రకటించారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా నరేంద్రబాబు ఎన్నికయ్యారు. ఇతనికి 61 ఓట్లు రాగా ప్రత్యర్థి గొజ్జ జనార్దన్‌కు 31 ఓట్లు వచ్చాయి. దీంతో 30 ఓట్ల తేడాతో నరేంద్రబాబు విజయం సాధించారు.

కార్యవర్గం
అసోసియేట్‌ అధ్యక్షులుగా టి.రమేశ్, ఎ.ప్రభాకర్, మహిళా అసోసియేట్‌ అధ్యక్షురాలిగా సుహాసిని, ఉపాధ్యక్షులుగా అశోక్‌రెడ్డి, జి.ఎల్‌.వి.ప్రసాద్, మల్కాగౌడ్, కె.లక్ష్మణ్, మునీందర్‌రాజు, ఉపాధ్యక్షులుగా సీహెచ్‌.వందన, కార్యదర్శులుగా జమీల్‌ అహ్మద్, టి.నర్సిములు, లక్ష్మీరాజ్యం, జగదీశ్వర్, సాయినాథ్, మహిళా కార్యదర్శిగా అపర్ణ విజయం సాధించారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్ని కైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారావు, నరేంద్రబాబు పేర్కొన్నా రు. తమ సంఘ పటిష్టత కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. తమ గెలు పునకు కృషి చేసిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి, పత్రిక ప్రధాన సంపాదకులు పర్వతి సత్యనారాయణ, జీవన్, ఎన్నికల పరిశీలకులు నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు కమలాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి మోహన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు