లేగదూడ రోజుకు రెండు లీటర్ల పాలు

1 Sep, 2016 20:37 IST|Sakshi

ఎదకు రాకుండానే ఓ లేగదూడ రోజుకు రెండులీటర్ల పాలను ఇవ్వడం విస్మయం కలిగిస్తోంది. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం కిల్లారిపల్లెకు చెందిన కాంతమ్మకు ఒక లేగదూడ ఉంది. దీనివయసు 20నెలలు. ఈ దూడకు పొదుగు రావడంతో పాలను పితికిచూసింది. పాలు రావడం గమనించింది. వారం రోజులుగా ఈ దూడ ఉదయం, రాత్రి కలిపి రెండులీటర్లు ఇస్తున్నది. పాలను పితక్కుండా వదిలేసినట్లయితే దూడ పడుకున్న సమయంలో పాలు నేలపై కారిపోతున్నాయి. దీనిపై పశువైద్యాధికారి డాక్టర్ శివరాజన్ స్పందిస్తూ కొన్నిలేగ దూడల్లో హార్మోన్ల సమతుల్య లోపం వల్ల ముందస్తుగానే పాలు వస్తాయన్నారు. ఇలాంటి దూడలు రెండు నుంచి పదిరోజుల వరకు మాత్రమే పాలు ఇస్తాయని చెప్పారు.  ఇలాంటి ఘటనలు అరుదుగా ఉంటాయన్నారు.


 

మరిన్ని వార్తలు