ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టండి?

14 Nov, 2015 20:02 IST|Sakshi
ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టండి?

పై ఫోటోలో కింద వరుసలో కూర్చున్న బాలుడు (సర్కిల్) ఎవరో గుర్తు పట్టండి. గుర్తు పట్టలేదా? ఇంకాస్త దగ్గర నుంచి చూడండి. గుర్తు పట్టలేకపోతున్నారా? అయితే మీకో క్లూ ఇస్తాం...కనుక్కోండి! ఓ మాజీ ప్రధానమంత్రిని ఉద్దేశించి 'ఆయన కంటే చెప్రాసీలు నయం' అని ఒకసారి...'ఆంధ్రోళ్లు ఆఫీసర్స్, తెలంగాణోళ్ళు చెప్రాసీలా?' అంటూ మరోసారి తన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తుకొచ్చిందా...! అవును మీరు అనుకున్నంటున్న పేరు నిజమే..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాబ్. 48 ఏళ్ల కిందట ఏక్ దిన్‌కా చెప్రాసీగా పని చేశారు. 1967-68 విద్యా సంవత్సరంలో స్వపరిపాలన రోజు కేసీఆర్ అటెండర్ పాత్ర పోషించారట. అప్పుడాయన దుబ్బాక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నట్లు పాఠశాల రికార్డులను బట్టి తెలుస్తోంది.

 

నెత్తిమీద ఖద్దరు టోపీ... చంకలో అటెండెన్స్ రిజిష్టార్ పట్టుకుని పెద్దసారు (హెడ్ మాస్టర్) ముందు నడుచుకుంటూ వచ్చి టేబుల్ పై పెడుతూ ఆనందపడేవారని ఆయన బాల్య స్నేహితులు చెప్తున్నారు. కేసీఆర్ సొంత ఊరు చింతమడక నుంచి దుబ్బాక హైస్కూల్‌కు తన సోదరి సుమతితో కలిసి నడుచుకుంటూ వచ్చేవారని కేసీఆర్ సీనియర్ స్టూడెంట్ లక్ష్మీనారాయణ 'సాక్షి'తో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆనాటి స్వపరిపాలన మధుర క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు