డైరెక్టర్‌ అనితారామచంద్రన్‌ పర్యటన రద్దు

23 Jul, 2016 23:13 IST|Sakshi
  • మూడు గంటలపాటు ఎదురుచూపులు
  • మెుక్కలు నాటిన నాయకులు, అధికారులు 
  • సారంగాపూర్‌ : రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ అనితారామచంద్రన్‌ పర్యటన శనివారం రద్దయింది. దీంతో చేసేది లేక స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా మండలంలోని ధని–గోపాల్‌పేట్‌ రహదారి వెంట మొక్కలు నాటడానికి శనివారం అనితారామచంద్రన్‌ వస్తున్నారని స్థానిక అధికారులు, నాయకులకు సమాచారం అందింది. రోడ్డుకు ఇరువైపులా ఒకే సమయంలో మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం 11గంటలకు సమయం కేటాయించిన కమిషనర్‌ మధ్యాహ్నం రెండు గంటల వరకు రాలేదు.
     
    అప్పటి వరకు వేచి చూశారు. మధ్యాహ్నం సమయంలో హరితహారం కార్యక్రమంపై సమావేశం ఉండడంతో కమిషనర్‌ ధని గ్రామానికి రావడం లేదని సమాచారం అందింది. దీంతో చేసేదిలేక స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు రాజ్‌మహ్మద్, ఆలూరు పీఏసీఎస్‌ అధ్యక్షుడు ఆయిటి రమేష్, సర్పంచ్‌ తుల లక్ష్మి ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. మండల ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, మండల ప్రత్యేకాధికారి రాంకిషన్‌నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు గంగారెడ్డి, దేవీశంకర్, పూజారి శ్రీనివాస్, తహసీల్దార్‌ శ్యామ్‌సుందర్, ఎంపీడీఓ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు