సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే

29 Jul, 2016 00:01 IST|Sakshi
పలమనేరు: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల పెన్షన్‌ హక్కును హరించేలా రూపొందించిన కాంట్రిబ్యూటరరీ పెన్షన్‌ స్కీమ్‌ను రద్దు చేయాలని స్థానిక యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఎన్‌జీవోస్‌ హోమ్‌ వద్ద గురువారం వారు సీపీఎస్‌కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో స్థానిక తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తొలిసంతకం చేశార. ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి సోమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ పథకంలో ఉద్యోగులు రిటైర్‌ అయినా, చనిపోయినా వారి కుటుంబాలకు కనీస భద్రతలేదన్నారు. ఇందులో కుటుంబపెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్, పీఎఫ్‌ ఒక్కవేటుతో రద్దు చేయడం చాలా బాధాకరమన్నారు. ఈవిధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఏపీఎన్‌జీవో తాలూకా అధ్యక్షులు ఆనంద్‌బాబు డిమాండ్‌ చేశారు.  ఆగస్టు 31లోగా సంతకాల సేకరణ పూర్తవుతుందని, సెప్టెంబరు రెండో తేదీ సార్వత్రికసమ్మె. నవంబరు 29న చలోపార్లమెంటు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆసంఘ జిల్లా కార్యదర్శులు సీపీ ప్రకాష్, సుధాకరరెడ్డి, పలువురు సంఘ నాయకులు మాట్లాడారు.
>
మరిన్ని వార్తలు